
హైదరాబాద్: ఐపీఎల్ వేలం రెండో రోజు అదే జోరును ప్రదర్శిస్తుంది. సీనియర్ ఆటగాళ్లకు మొదటి రోజు తక్కువ ధర పలకడం రెండో రోజుకు కొనసాగుతోంది. యువ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్రాళ్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
ఢిల్లీ డేర్ డెవిల్స్ మొట్ట మొదటి నేపాల్ క్రికెటర్‌ను తమ జట్టు తరపున ఐపీఎల్‌లో ఆడనివ్వనుంది. నేపాల్ క్రికెటర్ అయిన సందీప్ లమిచానే ఇండియన ప్రీమియర్ లీగ్‌లో బరిలో దిగుతున్నాడు. 17 ఏళ్ల సందీప్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడిన సందీప్ లెగ్ బ్రేక్ గూగ్లీలతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు.
లామిచానే పట్ల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ప్రశంసలు గుప్పించాడు. హాంగ్ కాంగ్ తరఫున మెంటార్‌గా పనిచేసిన క్లార్క్.. కొద్ది సమయంలోనే సందీప్‌లో చక్కటి ప్రావీణ్యం ఉందని గుర్తించాడు. లామిచానేకు న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో ఆడే అవకాశం కల్పించాడు.
బంగ్లాదేశ్‌లో 2016లో జరిగిన వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా సందీప్ నిలిచాడు. ఆ టోర్నీలో 14 వికెట్లు తీయడంతోపాటు ఐర్లాండ్‌పై 27 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇతడి బౌలింగ్ ప్రదర్శనపై షేన్ వార్నే కూడా ప్రశంసలు గుప్పించాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ నలుగురు అప్ఘాన్ ఆటగాళ్లు, ఇద్దరు బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐపీఎల్ వేలంలో చోటు దక్కింది. నేపాల్ నుంచి సందీప్ ఆడనున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.