Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌ను ఓడించడానికి శ్రీలంక భారీ స్కెచ్.. రంగంలోకి దిగ్గజ క్రికెటర్!

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ ప్రస్తుతం జింబాబ్వే‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. జులై 27 నుంచి లంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడాల్సి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ యువకులను పంపింది.

భారత క్రికెట్ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ కుర్రాళ్లకు అవకాశాలు అందిస్తుంది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరనుంది. ఈ మెగాటోర్నీలో వన్డే ఫార్మాట్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీకి తగ్గట్లుగా భారత్ ప్లాన్ చేస్తోంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సీనియర్లతో పాటు యువకులను జట్టులోకి తీసుకురావాలని చూస్తోంది. టీ20 ప్రపంచకప్‌‌కు ఎంపిక కానీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ వన్డే సిరీస్‌కు ఎంపిక కావడం దాదాపు ఖాయమే.

Sanath Jayasuriya Set to Replace Chris Silverwood as Sri Lanka Coach for India Series

మరోవైపు భారత్ సిరీస్‌ను శ్రీలంక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయామనే కసితో లంక ఉంది. అంతేగాక తమ పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత సిరీస్‌కు దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్యకు కోచ్ బాధ్యతలు లంక బోర్డు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో శ్రీలంక జట్టులో మార్పు తీసుకువస్తుందని బోర్డు ఆశిస్తోంది.

Sanath Jayasuriya Set to Replace Chris Silverwood as Sri Lanka Coach for India Series

వన్డే, టీ20 వరల్డ్ కప్‌ల్లో శ్రీలంక ఘోర పరాజయాలకు ప్రధానంగా కారణం బ్యాటింగ్ వైఫల్యమే. బ్యాటర్లు తేలిపోవడంతో బౌలర్లు పోరాటం వృథాగా మారిపోయింది. ఈ స్థితిలో ఉన్న జట్టును బలోపేతం చేయడానికి క్రిస్ సిల్వర్‌‌వుడ్ స్థానంలో కోచ్‌గా జయసూర్యకు బాధ్యతలు అప్పగించాలని బోర్డు నిర్ణయించుకుందని సమాచారం. జయసూర్య విధ్వంసకర బ్యాటర్‌గా పరుగుల వరద పారించాడు. 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టీ20లు ఆడిన అపారమైన అనుభవం అతని సొంతం. అతని రాకతో లంక రాత మారుతుందేమో చూడాలి!

Story first published: Monday, July 8, 2024, 14:59 [IST]
Other articles published on Jul 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+