న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని ఔట్ చేయడానికి అలా ప్లాన్ చేశారట!!

India Vs West Indies 2018, 3rd ODI : Samuels Bowling Efforts Come Despite Limited Practice| Oneindia
Samuels bowling efforts come despite limited practice

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ క్రీజులో నిలబడి తానొక్కడై మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుత టీమిండియాలో ఏ ప్రత్యర్థి జట్టు అయినా కోహ్లీని పడగొడితే చాలన్నట్లుగానే భావిస్తోంది. ఈ క్రమంలోనే పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో పక్కా వ్యూహంతోనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని వెస్టిండీస్ టీమ్ బోల్తా కొట్టించినట్లు తెలుస్తోంది.

 భారత్ ఘోర వైఫల్యం ఇలా:

భారత్ ఘోర వైఫల్యం ఇలా:

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు 47.4 ఓవర్లలో 240 పరుగులకే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.

కోహ్లీని వెస్టిండీస్ బుట్టలో వేసినట్లు శామ్యూల్స్

కోహ్లీని వెస్టిండీస్ బుట్టలో వేసినట్లు శామ్యూల్స్

మ్యాచ్‌లో సెంచరీకి పైగా కెప్టెన్ విరాట్ కోహ్లి (107: 119 బంతుల్లో 10ఫోర్లు, 1సిక్సు) కొట్టాడు. టీమిండియా 220 స్కోరు వద్ద కీలక సమయంలో కోహ్లీ ఔట్ అయ్యాడు. దీంతో.. భారత్ చేతి నుంచి మ్యాచ్ చేజారింది. అయితే.. పక్యా వ్యూహంతోనే కోహ్లీని వెస్టిండీస్ బుట్టలో వేసినట్లు బౌలర్ శామ్యూల్స్ మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇన్నింగ్స్ 42వ ఓవర్, శామ్యూల్స్ మ్యాచ్‌లో వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే విరాట్ కోహ్లిని బౌల్డ్ చేశాడు.

బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్లని ఉంచిన వెస్టిండీస్

బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్లని ఉంచిన వెస్టిండీస్

వాస్తవానికి కాలి గాయం కారణంగా.. గత కొంతకాలంగా బౌలింగ్‌కి దూరంగా ఉంటున్న శామ్యూల్స్ నెట్స్‌లో కనీసం ప్రాక్టీస్ కూడా చేయట్లేదట. అయినప్పటికీ.. పుణె వన్డేలో అతను విసిరిన బంతిని అర్థం చేసుకోలేకపోయిన కోహ్లి.. క్లీన్ బౌల్డయ్యాడు. మిడ్‌ వికెట్, లాంగాన్‌లో మాత్రమే బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్లని ఉంచిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్.. క్రీజులో ఉన్న కోహ్లీని ఫుల్‌షాట్ ఆడేలా ప్రేరేపించాడు. అప్పటికే క్రీజులో ప్రధాన బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోవడంతో కోహ్లీ కూడా సాహసోపేత షాట్‌‌కి ప్రయత్నించి బౌల్డయ్యాడు.

మ్యాచ్‌ని మలుపు తిప్పినందుకు సంతోషంగా

మ్యాచ్‌ని మలుపు తిప్పినందుకు సంతోషంగా

మోకాలి గాయం నుంచి నేను ఇటీవల కోలుకోవడంతో.. నెట్స్‌లో కూడా బౌలింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయట్లేదు. సిరీస్‌లో నేను బ్యాట్‌తో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోవడంతో.. కనీసం బౌలింగ్‌తోనైనా.. మ్యాచ్‌ని మలుపు తిప్పినందుకు సంతోషంగా ఉంది' అని మ్యాచ్ అనంతరం శామ్యూల్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, October 28, 2018, 14:15 [IST]
Other articles published on Oct 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X