Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేల్ వినోదం పంచుతున్నాడు: 'సెక్సిజం' డారెన్ సమీ

న్యూఢిల్లీ: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడైన క్రిస్ గేల్ 'సెక్సిజం' వ్యాఖ్యల పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, గేల్‌కు వెస్టిండీస్ ప్రపంచ కప్ ట్వంటీ 20 విన్నింగ్ కెప్టెన్ డారెన్ సమీ నుంచి మద్దతు లభించింది.

గేల్ పైన విమర్శల్లో అర్థం లేదన్నాడు. తన వరకు మన క్రికెట్ హీరోల్లో గేల్ ఒకడు అన్నాడు. అతను వినోదం కలిగిస్తుంటాడని, జట్టు సభ్యుడిగా గేల్‌ను గౌరవిస్తానని చెప్పాడు. గేల్‌ను విమర్శించడంలో కారణం కనిపించడం లేదన్నాడు. తాను ఎప్పుడు అతనికి మద్దతుగా ఉంటానని చెప్పాడు.

Sammy defends Gayle, calls him 'entertainer'

గేల్ మైదానంలో ఏం చేశాడన్నదే ముఖ్యమని చెప్పాడు. క్రికెటర్లుగా తమకు కూడా బాధ్యత ఉందని, అభిమానులు తమను గమనిస్తుంటారని చెప్పాడు. అయితే, కొన్నిసార్లు న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ కోసం గేల్‌ను టార్గెట్ చేస్తున్నారని తాను భావిస్తున్నానని చెప్పాడు. క్రిస్ గేల్ యునివర్సల్ బాస్ అన్నాడు.

బిగ్ బాష్ ట్వంటీ 20 లీగ్ సందర్భంగా బ్రిటిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఐపీఎల్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+