
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, స్టార్ బ్యాట్స్ మెన్ అయిన రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ కూడా తండ్రి బాటలోనే క్రికెటర్‌గా ఎదుగుతున్నా డు. అండర్-14 విభాగంలో బీటీఆర్ కప్ నేపథ్యంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి.
ఈ పోటీల్లో 412 పరుగుల తేడాతో గెలిచిన జట్టులో సమిత్ (జూనియర్ డ్రావిడ్) ఒక్కడే 150 స్కోరును చేశాడు. అంతర పాఠశాలల టోర్నీలో సమిత్ సెంచరీ టోర్నీలోనే ఒక హైలెట్‌గా మారింది.
వివేకానంద స్కూల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సమిత్ భారీ శతకం సాధించడంతో అతని జట్టు మాల్య అదితి ఇంటర్నేషనల్ స్కూల్ 412 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
మాజీ స్పిన్నర్ సునీల్ జోషి తనయుడు సమిత్‌ను మించి పోయాడు. ఆర్యన్ (154) కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సమిత్-ఆర్యన్ కదం తొక్కడంతో మాల్యా స్కూల్ 50 ఓవర్లలో 500 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రతిగా వివేకానంద స్కూల్ 88 పరుగులకే కుప్పకూలింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.