Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సామ్ కరన్‌కు కరోనా నెగెటివ్‌.. ఊపిరి పీల్చుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు!!

Sam Curran tests negative for Coronavirus, to resume training

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం అర్ధరాత్రి కరన్‌ అస్వస్థతకు గురవడంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లాడు. స్వల్పంగా జ్వరం, డయేరియాతో బాధపడటంతో కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో అతనికి టెస్ట్‌ చేశారు. రిపోర్టులో వైరస్‌ సోకలేదని తేలడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

సామ్‌ కరన్‌ 24 నుంచి 48 గంటల్లో తిరికి ట్రైనింగ్‌లో పాల్గొంటాడని ఈసీబీ తెలిపింది. ఇంగ్లండ్ జట్టు డాక్టర్‌ ఈ యువ ఆల్‌రౌండర్‌ను నిత్యం పర్యవేక్షిస్తాడని చెప్పింది. ప్రస్తుతం కరన్‌ బాగానే ఉన్నాడని పేర్కొంది. మరోవైపు కరన్‌తో పాటు మిగతా జట్టు సభ్యులు, సహాయ సిబ్బందికి ఆదివారం మరోసారి కరోనా పరీక్షలు చేయనున్నారు. 22 ఏళ్ల కరన్‌ ఇంగ్లండ్ తరఫున 17 టెస్టులు, 4 వన్డేలు, 5 టీ20లు ఆడాడు.

కరోనా వైరస్ కారణంగా‌ దాదాపు నాలుగు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ జరగడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. మరికొన్ని దేశాల్లో మాత్రం సాధన చేసేందుకూ అనువైన పరిస్థితులు లేవు. అయితే ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు వెస్టిండీస్‌ జట్టుతో బయో సెక్యూర్ వాతారణంలో సిరీస్ ఆడించేందుకు సిద్దమయింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బయో సెక్యూర్‌ వాతావరణంలో సౌతాంప్టన్‌ వేదికగా జులై 8 నుంచి తొలి మ్యాచ్‌ ఆరంభం కాబోతోంది. బంతిపై ఉమ్మి రాయడం నిషేధం, సంబరాలపై ఆంక్షల నేపథ్యంలో సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

ఇక బయోసెక్యూర్ వాతావరణం, ఐసీసీ తాత్కలిక నిబంధనలతో ఆడినా.. సామ్ కరణ్ అస్వస్థతకు గురవ్వడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. మహమ్మారి నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఈ సిరీస్‌లో క్రికెట్ రిస్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో కరన్‌కు కరోనా నెగెటివ్‌ వచ్చినా.. ఆటగాళ్ల అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. చీలమండ శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్న స్టార్ పేసర్‌ షానన్‌ గాబ్రియేల్‌ మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రిజర్వ్‌ ఆటగాడిగా ఇంగ్లండ్‌కు వచ్చిన గాబ్రియేల్.. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో జరిగిన రెండు వామప్‌ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడికి అవకాశం ఇచ్చింది.

Story first published: Saturday, July 4, 2020, 12:24 [IST]
Other articles published on Jul 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+