Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ గొప్ప కెప్టెన్.. అతని సార‌థ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా: ఇంగ్లాండ్ క్రికెటర్‌

Sam Curran sasys MS Dhoni a great captain, eager to pick his brains

లండన్: టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ గొప్ప కెప్టెన్ అని ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ స్యామ్ క‌ర‌న్ ప్రశంసలు కురిపించాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు తరఫున ధోనీ నాయ‌క‌త్వంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా అని క‌ర‌న్ తెలిపాడు. ఐపీఎల్‌-2020 వేలంలో కరన్‌ను సీఎస్‌కే రూ. 5.5కోట్లకు దక్కించుకుంది. గ‌త సీజ‌న్ వ‌ర‌కు కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ త‌ర‌ఫున ఆడిన క‌ర‌న్‌.. ఈసారి సీఎస్‌కే తరపున ఆడనున్నాడు.

ధోనీ గొప్ప కెప్టెన్:

ధోనీ గొప్ప కెప్టెన్:

సీఎస్‌కేతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా స్యామ్ క‌ర‌న్ పలు విషయాలు పంచుకున్నాడు. 'ఈ ఏడాది ఐపీఎల్ జ‌రుగుతుందా లేదా అనే అంశంపై ఎవ‌రికి స్ప‌ష్ట‌త లేదు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను పాటించాలి. అన్ని బాగుంటే.. ఇప్పటికి చెన్నైలో ఉండేవాడిని. కానీ.. పరిస్థితులు అనుకూలంగా లేవు. ధోనీ గొప్ప కెప్టెన్. అతడి నాయ‌క‌త్వంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. వైర‌స్ మ‌హ‌మ్మారి నా ఆశలను చిదిమేసింది' అని క‌ర‌న్ తెలిపాడు.

ఆతృత‌గా చూస్తున్నా:

ఆతృత‌గా చూస్తున్నా:

'ఫ్రాంచైజీ మార‌డంతో ఐపీఎల్ ఆడడంపై ఎంతో ఉత్సుక‌త‌తో ఎదురుచూస్తున్నా. స్టార్ ఆట‌గాళ్ల‌తో నిండి ఉన్న చెన్నై జ‌ట్టుతో క‌లిసేందుకు ఆతృత‌గా చూస్తున్నా. స్టీఫెన్ ఫ్లెమింగ్‌లో లాంటి గొప్ప కోచ్ చెన్నై జట్టుకు ఉన్నాడు. చాలా సంఖ్యలో భారత ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వారితో ఆడడం వాళ్ళ ఎంతో నేర్చుకోవచ్చు. సామ్ బిల్లింగ్స్ గత రెండు సంవత్సరాలుగా చెన్నై తరపునే ఆడుతున్నాడు. అతడు నాకు చాలా విషయాలు చెప్పాడు' అని స్యామ్ క‌ర‌న్ పేర్కొన్నాడు.

వాట్సాప్ గ్రూప్‌కి ఆహ్వానించారు:

వాట్సాప్ గ్రూప్‌కి ఆహ్వానించారు:

'నన్ను చెన్నై వాట్సాప్ గ్రూప్‌కి ఆహ్వానించారు. అందరూ స్వాగతం పలికారు. ఎంతో సంతోషమేసింది. గ్రూప్‌ ద్వారా వైరస్ మరియు ఇతర విషయాల గురించి సమాచారం తెలుసుకుంటున్నా. శిక్షణా సెషన్‌ను అనుసరిస్తున్నా. ఇది అందరికీ భయానక సమయం. ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉందాం' అని ఇంగ్లీష్ ఆల్‌రౌండ‌ర్ చెప్పుకొచ్చాడు. క‌ర‌న్ ఇంగ్లండ్ తరఫున 17 టెస్టులు, 4 వన్డేలు, 5 టీ20లు ఆడాడు.

సీఎస్‌కే తరుపున ఆడటం ఎంతో ప్రత్యేకం:

సీఎస్‌కే తరుపున ఆడటం ఎంతో ప్రత్యేకం:

వేలం అనంతరం క‌ర‌న్ మాట్లాడుతూ... 'నా ఎంపికకు సహకరించిన ధోనీ, ఫ్లెమింగ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో చెన్నైలో ప్రత్యర్థి జట్టు సభ్యుడిగా బరిలోకి దిగాను. కానీ ఈసారి చెన్నై అభిమానుల సమక్షంలో సీఎస్‌కే తరుపున ఆడటం ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాను. అభిమానుల అంచనాలను అందుకునేలా గొప్ప ప్రదర్శన ఇస్తామనే ధీమా ఉంది. అంతేకాకుండా చెన్నైకి రావడానికి, నా కొత్త టీం సభ్యులను కలుసుకోవడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నాను. ధోని సారథ్యంలో.. ఫ్లెమింగ్‌ కోచింగ్‌లో ఆడటం నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఐపీఎల్‌-2020 ట్రోఫిని చెన్నైకి తీసుకొస్తామనే విశ్వాసం ఉంది' అంటూ కరన్‌ పేర్కొన్నాడు.

చివరి మెట్టుపై బోల్తా:

చివరి మెట్టుపై బోల్తా:

ఇప్పటివరకు మూడు ఐపీఎల్‌ టైటిళ్లను గెలుచుకున్న సీఎస్‌కే జట్టు గత సీజన్‌-12లో రన్నరప్‌గా నిలిచింది. అసాధరణ పోరాటపటిమతో ఆకట్టుకున్న ధోనీ జట్టు చివరి మెట్టుపై బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది. అయితే గత అనుభవాల దృష్ట్యా జట్టులో అనేక మార్పులు చేసింది. దీనిలో భాగంగా బౌలింగ్‌ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కరన్‌, చావ్లా, హేజిల్‌వుడ్‌లను జట్టులోకి తీసుకుంది. దీంతో సీఎస్‌కే బౌలింగ్‌ దళం దుర్బేద్యంగా తయారయ్యింది.

Story first published: Wednesday, April 15, 2020, 15:03 [IST]
Other articles published on Apr 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+