Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : వేలం గురించి ఆలోచిస్తూ రాత్రి నిద్ర కూడా పోలేదు: శామ్ కర్రాన్

Sam Curran says he could not sleep because of mini auction

ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. అతన్ని మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో ఇంత భారీ ధర ఏ ఆటగాడికీ లభించలేదు. ఇంత భారీ ధరకు అమ్ముడుపోయే ముందు ఎగ్జయిట్‌మెంట్‌తో తనకు నిద్ర కూడా పట్టలేదని శామ్ కర్రాన్ చెప్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన కర్రాన్.. ఆ టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు కూడా అందుకున్నాడు. అప్పటి నుంచే ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను అతనిపై పడింది.

మినీ వేలంలో కర్రాన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ హోరా హోరీగా తలపడ్డాయి. అయితే చివరకు రూ.18.75 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. కర్రాన్ తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించింది కూడా పంజాబ్‌తోనే కావడం గమనార్హం. ఇదే విషయాన్ని చెప్పిన కర్రాన్.. 'నేను రాత్రి పెద్దగా నిద్రపోలేదు. ఎగ్జయిట్‌మెంట్‌తో నిద్ర రాలేదు. వేలం ఎలా ఉండబోతుంది? అనే ఆలోచనతోనే గడిపేశా. అంత భారీ ధర వస్తుందని అసలు ఊహించలేదు' అని చెప్పాడు.

మళ్లీ పంజాబ్‌తో చేరడంపై కర్రాన్ సంతోషం వ్యక్తం చేశాడు. 'నా ఐపీఎల్ కెరీర్ మొదలైన ఫ్రాంచైజీకి మళ్లీ చేరడం చాలా సంతోషంగా ఉంది. నాలుగేళ్ల క్రితం పంజాబ్‌ ఆటగాడిగానే ఐపీఎల్ అరంగేట్రం చేశా. మళ్లీ ఆ జట్టుతో చేరడం చాలా బాగుంది. ఆ జట్టులో ఉన్న ఇంకొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లను కలవడం కోసం ఎదురు చూస్తున్నా' అని చెప్పాడు. నాలుగేళ్ల క్రితం 2019లో కర్రాన్‌ను రూ.7.20 కోట్లకు అతన్ని పంజాబ్ కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో అద్భుతంగా రాణించిన అతను.. పంజాబ్ తరఫున హ్యాట్రిక్ తీసుకున్నాడు. అలాగే కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు.

Story first published: Saturday, December 24, 2022, 8:25 [IST]
Other articles published on Dec 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+