T20 World Cup 2021: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. ప్రపంచకప్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్! కారణం ఏంటంటే?

లండన్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్.. మెగా టోర్నికి దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా అతడు టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి వైదొలిగాడు. సామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే రీస్ టోప్లేను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికచేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఏదేమైనా ఇంగ్లండ్ జట్టు సామ్ కరన్ సేవలను కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.

వెన్నునొప్పితో బాధపడుతున్న సామ్:
ప్రస్తుతం ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరపున ఆడుతున్న సామ్ కరన్.. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. ప్రస్తుతం సామ్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. రాజస్తాన్ మ్యాచ్ అనంతరం సామ్‌ను పరీక్షల కోసం స్కానింగ్‌కు పంపించారు. తాజాగా వెల్లడించిన రిపోర్ట్స్‌లో సామ్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉందని ఈసీబీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో యూకేకు చేరుకోనున్న సామ్‌ను తదుపరి మెడికల్ పరీక్షలకు పంపనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని ఈసీబీ తెలిపింది. ఇప్పటికే బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన ఇంగ్లండ్.. తాజాగా సామ్ కరన్ సేవలను కూడా కోల్పోయి కాస్త బలహీనపడింది.

సామ్ కరన్ విచారం:
అర్ధాంతరంగా ఐపీఎల్ 2021ను వీడటంపై సామ్ కరన్ విచారం వ్యక్తం చేశాడు. 'దురదృష్టవశాత్తు ఐపీఎల్ 2021 సహా టీ20 ప్రపంచకప్ 2021ను మిస్ అవుతున్నా. మంచి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వీడటం చాలా బాధగా ఉంది. చెన్నై ఫ్యాన్స్ మద్దతు ఎప్పటికి మరవలేనిది. త్వరలోనే కలుస్తా' అని సామ్ కరన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం యూఏఈలోనే ఉన్న సామ్.. త్వరలోనే లండన్ చేరుకోనున్నాడు. ఆపై మెడికల్ పరీక్షలకు వెళ్లనున్నాడు. 2016లో టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఇంగ్లండ్.. 2019 ప్రపంచకప్ గెలిచి మంచి జోరు మీద ఉంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2021 గెలవాలని చూస్తోంది.

అక్టోబర్ 17న ఆరంభం:
టీ20 ప్రపంచకప్ 2021 యూఏఈ, ఒమన్ వేదికగా జరగనుంది. అక్టోబర్ 17న మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 14 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ యూఏఈకి తరలిపొయిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021 ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అందరూ ఊహించిన విధంగానే ఈసీబీ ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తప్ప.. రెగ్యులర్‌గా టీ20ల్లో ఆడే ఇంగ్లీష్ ప్లేయర్స్ అందరు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. తాజాగా గాయం కారణంగా సామ్ ఔట్ అయ్యాడు.

ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications