న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!

Sam Curran fined for provocative behaviour during ENGvsSA ODI

క్రికెట్ అని కాదు.. ఏ క్రీడలో అయినా ప్రత్యర్థి ఆటగాళ్లను అవుట్ చేస్తే సెలబ్రేట్ చేసుకోవడం పరిపాటే. క్రికెట్‌లో ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఫామ్‌లో ఉన్న ప్రత్యర్థి బ్యాటర్‌ను పెవిలియన్ చేస్తే ఆ బౌలర్ ఆనందానికి హద్దులుండవు. కొందరు గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకుంటే, మరికొందరు పెద్దగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఏం చేసినా మ్యాచ్‌లో అతి చేయకూడదు కదా. ఈ లాజిక్ మిస్సయ్యాడు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్.

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు వెళ్లిన ఆ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ కుప్పకూలడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. రెండో మ్యాచ్‌లో 342 పరుగుల భారీ స్కోరు చేసినా కూడా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ ఛేజ్‌లో సఫారీ బ్యాటర్ టెంబా బవుమా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతన్ని అవుట్ చేసిన కర్రాన్.. బవుమా వైపు చూస్తూ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది అంపైర్లకు ఏమాత్రం నచ్చలేదు. అతను ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని నియమావళిని ఉల్లంఘించినట్లు వాళ్లు భావించారు.

మ్యాచ్ రిఫరీలు, థర్డ్ అంపైర్ ముగ్గురూ అతనిపై ఫిర్యాదు నమోదు చేశారు. దీంతో కర్రాన్‌ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించాలని నిర్ణయించారు. తనపై వచ్చిన ఈ ఫిర్యాదుపై కర్రాన్ స్పందించలేదు. దీంతో అతను ఈ సొమ్ము చెల్లించేందుకు ఒప్పుకున్నాడనే చెప్పాలి. దీనికితోడు అతనికి రెండు డీమెరిట్ పాయింట్లు కూడా జోడించినట్లు సమాచారం. ఈ రెండేళ్ల కాలంలో కర్రాన్‌కు ఇలా డీమెరిట్ పాయింట్లు దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, ఆ మ్యాచ్‌లో కర్రాన్ మాత్రమే కొంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే సౌతాఫ్రికా ఛేదించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ తన ఖాతాలో వేసుకుంది.

Story first published: Wednesday, February 1, 2023, 12:28 [IST]
Other articles published on Feb 1, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X