Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డు.. డు.. అంబటి రాయుడు అంటోన్న ఇంగ్లాండ్ క్రికెటర్లు (వీడియో)

Sam Billings grooves to Mark Woods tribute to Ambati Rayudu

హైదరాబాద్: ఐపీఎల్ 11లో చెన్నై ఆటగాళ్లు భళే ఉత్సాహంగా గడిపేస్తున్నారు. అయితే వారితో పాటుగా మద్దతిచ్చే వాళ్లూ తక్కువ సంఖ్యలో లేరు. ఈ మధ్యలో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. బౌలర్లను అదరగొడుతున్న అంబటి రాయుడుపై డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఓ వీడియో విడుదలైంది. ఇది చెన్నై ఆటగాళ్లది కాదు. ఇంగ్లాండ్ క్రికెటర్లది. హైదరాబాదీ ఆటగాడైన అంబటి రాయుడి గురించి ఆ జట్టు ఆటగాడు మార్క్‌వుడ్‌ ఓ పాట సిద్ధం చేశాడు. ఆ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

డు..డు..డు.. అంబటి రాయుడు

‘డు..డు..డు.. అంబటి రాయుడు' అంటూ సాగే ఈ పాటను మార్క్‌వుడ్‌ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వుడ్‌ పోస్ట్‌ చేసిన ఈ పాట అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో విశేషంగా రాణిస్తోన్న ఆటగాళ్లలో రాయుడు ఒకడు. 12 మ్యాచ్‌ల్లో 535 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

సరిపోదు. అస్సలు సరిపోవట్లేదు:

'చెన్నైని చూసినప్పుడల్లా నా సొంత ప్రదేశంలో ఉన్నట్టే అనిపిస్తోంది. ఇది సరిపోదు. అస్సలు సరిపోవట్లేదు. ఏమైతే చెప్పిందో చెన్నై.. అవన్నీ చేసి చూపిస్తోంది.. అయినా ఈ బంధం సరిపోదు. డు.. డు.. డు.. డు.. డు.. డు.. అం.. బ..టి..రాయ్..డు' అనే అర్థంతో సాగుతోందీ పాట.

మార్క్ వుడ్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే.

మార్క్ వుడ్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే.

ఈ ప్రదర్శన చూసిన బీసీసీఐ సెలక్టర్లు రాయుడుకి తిరిగి భారత జట్టులో ఆడే అవకాశాన్ని సైతం కల్పించారు. కొన్ని కారణాల వల్ల మార్క్‌వుడ్‌ మధ్యలోనే ఐపీఎల్‌ను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో వుడ్‌ చెన్నై తరఫున కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అది కూడా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే. తాజాగా మార్క్‌వుడ్‌ డ్రస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్ల మధ్య రాయుడుపై రాసిన పాటను పాడుతూ కనిపించాడు. వుడ్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా తమ గొంతుతో పాటు కాలును కదిపారు.

ఎడాపెడా ఉతికిఆరేశాడు..అంబటి రాయుడు :

ఎడాపెడా ఉతికిఆరేశాడు..అంబటి రాయుడు :

ఐపీఎల్ 2018 టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ను అంబటి రాయుడు ఎడాపెడా ఉతికిఆరేశాడు. అలా ఇలా బాదలేదు.. సెంచరీ బాదేశాడు. కళాత్మక విధ్వంసం సృష్టిస్తూ కళ్లుచెదిరే శతకంతో చెన్నైకు అద్భుత విజయం అందించాడు. ఈ మ్యాచ్ అనంతరం అంబటి రాయుడు స్పందిస్తూ, సన్‌రైజర్స్‌పై అద్భుత రీతిలో చెలరేగి అజేయ శతకాన్ని తన మేనమామకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. పుణె వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ అంబటి రాయుడు నాటౌట్‌గా 62 బంతుల్లో (100) మెరుపు సెంచరీ బాదడంతో సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది.

Story first published: Wednesday, May 16, 2018, 16:55 [IST]
Other articles published on May 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+