ఖుషీలో 'డింపుల్ బ్యూటీ': సల్మాన్ ఖాన్ స్పెషల్ మెసేజ్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్.. ఈ ఏడాది కూడా అదే ఊపుతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా.. ఒకటి ఫలితం తేలకుండా ముగిసింది. ఈ విజయాలతో పాయింట్ర పట్టికలో టాప్-2లో నిలిచిన ఏకైక అజేయ జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది. జట్టు ప్రదర్శన పట్ల అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు.
సల్మాన్ ఖాన్ అభినందనలు
పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆ జట్టు యజమాని ప్రీతీ జింటాను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర సందేశాన్ని పంపాడు. "వెల్ డన్ జింటా.. కంగ్రాట్యులేషన్స్. మీ టీమ్ చాలా బాగా ఆడుతోంది" అంటూ సల్మాన్ ఖాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. సుదీర్ఘ కాలంగా స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ఈ స్పోర్ట్స్ బాండింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

డూప్లెసిస్ ప్రశంసల జల్లు
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ బలంపై దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఫాఫ్ డూప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్‌లో టైటిల్ గెలిచే ఫేవరెట్ జట్లలో పంజాబ్ ఒకటని ఆయన పేర్కొన్నారు. "పంజాబ్ బ్యాటింగ్ యూనిట్ నిలకడగా రాణిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఫామ్ వంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, వారు టైటిల్ రేసులో ముందున్నారు" అని డూప్లెసిస్ విశ్లేషించాడు.
సన్‌రైజర్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ
ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 8 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా వెళ్లింది. అయితే పంజాబ్ బౌలర్లు పుంజుకుని వారిని 219 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్‌లో ప్రియాంశ్ ఆర్య (20 బంతుల్లో 57), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (25 బంతుల్లో 51) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications