For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ క్రికెట్ బోర్డు భారత్‌ను చూసి నేర్చుకోవాలి

Salman Butt, Kamran Akmal Ask Pakistan Selectors To Learn From India

హైదరాబాద్: బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అది ఎక్కడి నుంచో కాదు ప్రత్యర్థి దేశం పాకిస్థాన్ నుంచి మాజీ క్రికెటర్లు తెగపొగిడేస్తున్నారు. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు సల్మాన్‌ భట్‌, కమ్రాన్‌ అక్మల్‌ బీసీసీఐపై ప్రశంసల వర్షం కురిపించారు.

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) సెలక్టర్లు భారత్‌ను చూసి నేర్చుకోవాలని కోరారు. ఆటగాళ్లకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆటగాళ్ల ఆటతీరును విశ్లేషిస్తూ 'ఒకప్పుడు రోహిత్‌ శర్మ సగటు 25-30 మధ్య ఉండేది. బీసీసీఐ సెలక్టర్లు రోహిత్‌ ఆడేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించారు. దీంతో అతడు ఇప్పుడు ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడిలా తయారయ్యాడు.

దేశవాళీ క్రికెట్లో రాణించిన వాళ్లకు బీసీసీఐ అవకాశాలు కల్పిస్తోంది. దేశవాళీ క్రికెట్లో ఆడితే ఆటగాళ్లకు ఆత్మ విశ్వాసం పెరుగుతోంది. వీలైనంత ఎక్కువ సమయం వారు క్రీజులో ఉండగలరు. అందుకే ఆ దేశ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయగలుగుతున్నారు. మన బోర్డు సెలక్టర్లు అలాగే చేయాలి. వారిని చూసి నేర్చుకోవాలి' అని వారు అన్నారు.

అయితే రెండ్రోజుల ముందు పాక్ కోచ్ జావేద్ భారత్ అంత గొప్పేమి కాదన్నట్లు మాట్లాడాడు. 'భారత్‌తో మ్యాచులు ఆడకపోతే పాక్‌ క్రికెట్‌ ఏమీ చచ్చిపోదు. భారత్‌ మనతో ఆడాలనుకోవట్లేదు. ఇరు దేశాల మధ్య 10 ఏళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. అయితే ఏంటి? మన క్రికెట్‌ ఏమీ చచ్చిపోలేదు కదా'అని అతను ఘాటుగా విమర్శించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 6, 2018, 12:39 [IST]
Other articles published on Jan 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+