Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Salman Butt: మెక్‌కల్లమ్‌కు గింత కూడా బుద్ధి లేదు..అతనికి అటాకింగ్ ఒక్కటే తెలుసు

Salman Butt Criticized KKR Coach Brendon Mccullum Says Only He knows Attacking

పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్.. కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచింగ్ శైలిని తీవ్రంగా విమర్శించాడు. నిర్భయంగా క్రికెట్ ఆడాలనే మోటీవ్‌లో బుద్ధిలేని క్రికెట్‌ను ప్లేయర్ల చేత ఆడిస్తున్నాడని పేర్కొన్నాడు. సల్మాన్ బట్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్లోని ప్రస్తుత కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌కి ఒకే ఒక మార్గం తెలుసునని, పరిస్థితులు, పిచ్‌తో సంబంధం లేకుండా అటాకింగ్ గేమ్ ఆడడమే చేయాలనేది అతని వ్యూహమని చెప్పాడు.

అతనికి ఊపుడు ఒక్కటే తెలుసు

అతనికి ఊపుడు ఒక్కటే తెలుసు

అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులుగా భట్ మాట్లాడుతూ.. మెక్‌కల్లమ్‌కి కొన్ని సమస్యలున్నాయి. అతనికి తెలిసిందల్లా ఒకటే. పిచ్ రిపోర్టు, స్టేడియం గణాంకాలు, ఎంత స్కోరు చేస్తే బెటర్, ప్రత్యర్థి ఎవరూ ఇలాంటివేమీ మెక్‌కల్లమ్ పట్టించుకోడు. అటాకింగ్ గేమ్ ఒక్కటే మెక్ కల్లమ్‌కు తెలిసిన వ్యూహం. ఎంతసేపు బ్యాట్ ఊపాలనేదే అతనికి తెలుసు. స్వేచ్ఛగా ఆడాలని, త్వరగా స్కోర్ చేయాలని చెప్పడమే అతని పని. అతనో సెన్స్ లెస్ క్రికెట్‌ వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. భయం లేని క్రికెట్ అనే పేరుతో బుద్ధి లేని క్రికెట్‌ను ప్లేయర్ల చేత ఆడిస్తున్నాడు' అని భట్ చెప్పాడు.

 కెప్టెన్ అంటే ప్యూన్ కాదు

కెప్టెన్ అంటే ప్యూన్ కాదు

ఐపీఎల్ 2022లో కేకేఆర్ జట్టు ఎంపిక విషయంలో కోచ్, సీఈవో కూడా జోక్యం చేసుకుంటారంటూ ఇటీవల కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యల గురించి ఓ అభిమాని క్వశ్చన్ వేయగా.. దానికి స్పందించిన భట్ ఒక జట్టుకు అవసరమైనంత మేర స్వేచ్ఛనివ్వాలి. మీరు ఒకరిని కెప్టెన్‌గా చేసినప్పుడు అతను తప్పు చేసినా, ఒప్పు చేసినా స్వీకరించాలి.

కెప్టెన్ అంటే ప్యూన్ కాదు. అతను మీ ఆదేశాలన్నింటినీ పాటించేందుకు అతన్ని కెప్టెన్ చేయాలని చూడడం కరెక్ట్ కాదు అని భట్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలాండర్స్ కెప్టెన్‌గా మెక్ కల్లమ్ అంత విజయవంతమైన కెప్టెనేం కాదని బట్ తెలిపాడు. పీఎస్ఎల్‌లో 2017, 2018ఎడిషన్లలో లాహోర్‌కు నాయకత్వం వహించాడు. ఆ రెండు సార్లు ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిందని భట్ ప్రస్తావించాడు.

15ఓవర్లకు 7వికెట్లు కోల్పోయినా హిట్టింగ్ చేయమంటాడు

15ఓవర్లకు 7వికెట్లు కోల్పోయినా హిట్టింగ్ చేయమంటాడు

భట్ మాట్లాడుతూ.. 'లాహోర్ ఖలాండర్స్ జట్టుకు అతను కెప్టెన్సీ చేసినప్పుడు అతని వ్యూహమేంటో చూశాడు. మెక్‌కల్లమ్ భయం లేకుండా క్రికెట్ ఆడాలంటాడు. దాని అర్థం ఏంటంటే మైండ్‌ను పక్కన పెట్టాలి. 15ఓవర్లు మిగిలి ఉండగానే 10వికెట్లలో 7వికెట్లు కోల్పోయి ఉన్న టైంలో కూడా.. మెక్ కల్లమ్ హిట్టింగ్ చేయాలంటాడు.

పూర్తి ఓవర్లు ఆడితే గౌరవప్రదమైన స్కోరు వస్తుందని అతను కనీసం ఆలోచించడు. లహోర్ అతనికి చాలా అవకాశాలు ఇచ్చింది కానీ అతని పద్ధతి వర్కవుట్ కాలేదు.' అని భట్ కడిగిపారేశాడు. ఇక ఐపీఎల్ 2022సీజన్ తర్వాత మెక్‌కల్లమ్ కేకేఆర్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగనున్నాడు. అతను ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.

Story first published: Monday, May 16, 2022, 12:10 [IST]
Other articles published on May 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+