Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డా, వారిద్దరికి ఫిక్సింగ్‌లో పాల్గొనాలని చెప్పా'

కరాచీ: తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి సల్మాన్ భట్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి సల్మాన్ భట్‌తో పాటు ఆసిఫ్, అమీర్‌ల పైన పీసీబీ బ్యాన్ వేటు వేసింది. 2010లో ఇంగ్లాండుతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డానని భట్ అంగీకరించాడని పీసీబీ సోర్సెస్ చెబుతున్నాయి.

Salman Butt Confesses to Spot-Fixing in 2010: PCB Source

స్పాట్ ఫిక్సింగ్‌లో తాను పాల్గొనడంతో పాటు మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ ఆసిఫ్‌లను కూడా దింపినట్లు ఒప్పుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ షహర్యార్ ఖాన్‌తో లాహోర్‌లో భేటీ అయిన సందర్భంగా ఆయన అంగీకరించాడని తెలుస్తోంది.

స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నందుకు ఆయన క్షమాపణలు కోరాడు. అంతేకాదు విచారణలో ఐసీసీకి పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. అతను జాతికి కూడా క్షమాపణ చెప్పాడు. కాగా, భట్, మొహమ్మద్ ఆసిఫ్‌లు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఏమాత్రం సంతృప్తికరంగా లేమని ఐసీసీ చెప్పిన అనంతరం... తాజాగా భట్ తప్పును అంగీకరించారనే విషయం బయటకు వచ్చింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+