Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Salman Butt: అతను ఆడుతుంటే మార్క్ వా, మార్టిన్ గుర్తొస్తారు.. ప్రస్తుతం అలాంటి ప్లేయర్లు నలుగురైదుగురే..!

Salman Butt Appreciated Shubman Gill For His Classic Batting Style

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భల్ పలు సందర్భాల్లో.. భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (82పరుగులు) ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం గిల్‌పై సల్మాన్ భట్ ప్రశంసలు కురిపించాడు. అతన్ని ఆసీస్ దిగ్గజ ప్లేయర్లు అయిన డామియన్ మార్టిన్, మార్క్ వాతో భట్ పోల్చాడు. ఈ రోజుల్లో ప్లేయర్లు ఎక్కువగా పవర్ హిట్టింగ్ గురించే చూస్తున్నారు.

పవర్ హిట్టర్ల గురించే చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కూడా మాట్లాడుకునే రోజులు ఇవి. ఇలాంటి టైంలో శుభ్‌మాన్ గిల్ లాంటి క్లాసిక్ ప్లేయర్ తన టైమింగ్ నమ్ముకుంటాడని.. అతనో అద్భుత టైమింగ్ ప్లేయర్ అని పేర్కొన్నాడు. అతను సంప్రదాయ క్రికెట్ షాట్లు ఆడతాడని.. అలా ఆడే వారిలో బాబర్, గిల్ మరో నలుగురు అయిదుగురు ప్లేయర్లు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నారని నేను అనుకుంటున్నాను.. మిగిలిన వారందరూ పవర్ హిట్టింగ్ వైపు మారుతున్నారు అని భట్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు.

Salman Butt Appreciated Shubman Gill For His Classic Batting Style

'శుభ్‌మాన్ గిల్ ఆడుతుంటే నాకు మార్క్ వా, డామియన్ మార్టిన్ లాంటి ఆటగాళ్లు గుర్తుకొస్తారు. వారు సొగసైన టచ్ ప్లేయర్లు. వాళ్లు పెద్ద బలంగా ఏం బాదరు. కేవలం టచ్ ఆడుతారు. అంతే బౌండరీ వైపు బాల్ అలా వెళ్లిపోతూనే ఉంటుంది. శుభ్ మాన్ గిల్ కూడా అలాంటి ప్లేయరే. చాలా సొగసైన క్రికెట్ ఆడతాడు. అతను బ్యాటింగ్ చూడడం నాకు చాలా ఇష్టం.

అతను టెస్ట్ క్రికెట్‌లో మొదటిసారి బ్యాటింగ్ చేయడం చూసినప్పుడు.. అతను చాలా పెద్ద ఆటగాడు అవుతాడని నేను ముందే చెప్పాను' అని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. ఇకపోతే హరారే వేదికగా జరిగే రెండో వన్డేలో గిల్ ఓపెనింగ్ దిగుతాడో లేక రాహుల్ దిగుతాడో తేలాల్సి ఉంది.

Story first published: Friday, August 19, 2022, 19:37 [IST]
Other articles published on Aug 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+