Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కళ్లు నెత్తికెక్కాయేంట్రా

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా రన్నరప్ చెక్కును విసిరేశాడు. ఈ ప్రవర్తనతో ఆగ్రహించిన ప్రేక్షకులు అతన్ని నిరసనగా అరిచి మరీ తిట్టారు. ఈ సంఘటన స్టేడియం వద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజు శాంసన్- 24, శివం దూబే-33 తో కలిసి భారీ ఇన్నింగ్ నిర్మించడంతో గెలుపు ఖాయమైంది. పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో ఈ టోర్నీలో ఇది మూడో ఓటమి.

Salman Ali Agha Tosses Runners-Up Check

ఈ ఓటమి ఆఘాను నిరాశకు గురి చేసినట్టయింది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రతినిధి అమీనుల్ ఇస్లాం నుండి రన్నరప్ చెక్కును అందుకున్న అనంతరం దాన్ని కోపంతో విసిరేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ చర్యపై నెటిజన్ల నుండి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలా మంది అతని ప్రవర్తనను క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

ఓటమి అనంతరం ఆఘా మాట్లాడాడు. ఓటమి నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్‌లో విఫలం కావడమే ఓటమికి దారి తీసిందని పేర్కొన్నాడు. బ్యాటింగ్ సరిగ్గా చేలేకపోయామని, బౌలర్లు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు. గెలవడానికి తమవంతు ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్‌లో చివరి వరకు ఆడి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని పేర్కొన్నాడ ఆఘా. స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయామని అంగీకరించాడు.

Story first published: Monday, September 29, 2025, 7:50 [IST]
Other articles published on Sep 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+