
మంచు కొండల్లో విహరించాలని
అయితే దేశంలో లాక్‌డౌన్‌ని ఎత్తివేసిన తర్వాత ఎంఎస్ ధోనీ తన ప్లాన్స్‌పై పక్కా క్లారిటీతో ఉన్నట్లు అతని భార్య సాక్షి ధోనీ వెల్లడించారు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ఇన్‌స్టా లైవ్‌చాట్‌లో రూపా రమణితో సాక్షి మాట్లాడుతూ... 'లాక్‌డౌన్ తర్వాత క్రికెట్ ఉంటే.. ధోనీ మ్యాచ్‌లు ఆడతాడు. ఒకవేళ మ్యాచ్‌లు లేకపోతే.. నేను మహీ కలిసి మంచు కొండల్లో విహరించాలని ప్లాన్ చేసుకున్నాం. ధోనీకి మంచు అంటే మహా ఇష్టం. ఉత్తరాఖండ్‌లోని మంచు కొండల్లో విహరించాలని ధోనీ ఇప్పటికే ప్లాన్ చేసాడు' అని తెలిపారు.

మహీకి డ్రైవింగ్ అంటే ఇష్టం
'ఉత్తరాఖండ్‌లోని ఓ చిన్న పల్లెటూరులో బస చేయాలని ప్లాన్ చేశాం. అక్కడ మంచు కొండల్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఆ ట్రిప్‌కి విమానంలో కాకుండా రోడ్డు మార్గం ద్వారా వెళ్తాం. మహీకి డ్రైవింగ్ అంటే ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్ వేళ ధోనీ ఇంట్లోని ఏడు పాత బైకులకు కొత్త పరికరాలు అమర్చాడు. ఇప్పటికీ రాంచీ స్టేడియానికి ప్రాక్టీస్ కోసం మహీ సెల్ఫ్ డ్రైవింగ్‌లోనే వెళ్తాడు' అని సాక్షి చెప్పారు.

అవన్నీ పుకార్లని ట్వీట్ చేశా
ఈ సందర్భంగా ఆమె ధోనీ రిటైర్మెంట్‌పై చేసిన ట్వీట్‌ను ఎలాంటి పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చిందో చెప్పారు. 'ఆరోజు నాకు ఓ స్నేహితురాలు మెసేజ్ చేసి.. ఏం జరుగుతోందని అడిగింది, మధ్యాహ్నం నుంచి #DhoniRetires అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉందని చెప్పింది. దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అవన్నీ పుకార్లని ట్వీట్ చేశా. తర్వాత దాన్ని డిలీట్ చేశా. ఏదేమైనా నేను చెప్పాలనుకుంది చెప్పేశా. నా పని అయిపోయింది. సందేశం బయటకు తెలిసింది' అని సాక్షి వివరించారు.

హెయిర్‌స్టైల్‌తో మంచి ఫాలోయింగ్
ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తొలినాళ్లలో తన హెయిర్‌స్టైల్‌తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే, ఆ జుత్తు కొందరికి నచ్చలేదు. వారిలో ధోనీ భర్య సాక్షి కూడా ఒకరు. 'అదృష్టం కొద్దీ ధోనీకి పొడవాటి జుత్తు ఉన్నప్పుడు నేను చూడలేదు. ఒకవేళ నారింజ రంగులోని అలాంటి జుత్తును చూసినట్లయితే.. అతడిని మరోసారి కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. మీకు తెలుసు శరీర సౌందర్యం గురించి కొన్ని అభిప్రాయాలుండాలి' అని సాక్షి అన్నారు. ఇక రూపా ప్రతిస్పందిస్తూ.. ప్రతీ ఒక్కరూ ధోనీని అలా ఇష్టపడ్డారని గుర్తుచేశారు. అలాంటి జుట్టు హీరో జాన్ అబ్రహంకు సరిపోతుందని, ధోనీకి కాదని సాక్షి పేర్కొన్నారు.

10 నెలలుగా క్రికెట్‌కి దూరం
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.


Click it and Unblock the Notifications












