రాబిన్ ఊతప్పకు థ్యాంక్స్ చెప్పిన సాక్షి ధోని
అనంతరం సాక్షి ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో రాబిన్ ఊతప్ప, అతడి భార్య శీతల్‌ను ఉద్దేశించి ప్రత్యేకంగా పోస్టు చేశారు. "ఇక్కడ ఉన్న వ్యక్తికి థ్యాంక్స్, ధోనిని, నన్ను కలిపిన ఈ వ్యక్తికి కృతజ్ఞతలు. రాబిన్, శీతల్‌లను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. శీతల్ గతంలో కంటే నువ్వు చాలా హాట్‌గా ఉన్వావ్!" అని సాక్షి తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

సాక్షి పుట్టినరోజు వేడుకల్లో మెరిసిన పాండ్యా
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. గాయం కారణంగా ఈ పర్యటనకు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ పార్టీలో మెరిశాడు. సాక్షి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పాటల కార్యక్రమంలో బాలీవుడ్ ప్లేబాక్ సింగర్ రాహుల్ వైద్య తన పాటలతో అలరించాడు. ఈ క్రమంలో సింగర్‌తో పాటుగా పాండ్యా.. సాక్షిలు కూడా గొంతు కలిపారు.

నవంబరు 19, 1986న జన్మించిన సాక్షి
ఇక, సాక్షి-ధోనిల వివాహాం 2010లో జరిగింది. వీరికి ఓ కుమార్తె. పేరు జివా. నవంబరు 19, 1986న జన్మించిన సాక్షి.. డెహ్రాడూన్ లో వెల్హామ్ గర్ల్స్ స్కూల్ లో స్కూలింగ్ చేశారు. ఆమె తండ్రి కనోయి గ్రూప్ యొక్క బినాహరి టీ సంస్థలో ఉద్యోగి. ఔరంగబాద్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందింది. చిన్ననాటి స్నేహితులైన ధోని, సాక్షిల పరిచయం రాంచీలోని DAVశ్యామలీ పాఠశాలలో మొదలైంది.

హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాక్షి
అప్పటి నుంచే ధోనీ.. సాక్షిల కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు ఉండేవి. కొంత కాలం తర్వాత సాక్షి కుటుంబం ఉద్యోగ రీత్యా డెహ్రాడూన్‌కి వెళ్ళిపోయింది. హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాక్షి.. 2007లో ఇండియన్ క్రికెట్ జట్టు కోల్‌కతాలోని తాజ్‌లో ఉంటున్న సమయంలో సాక్షి,ధోనీ మళ్లీ కలుసుకున్నారు. సాక్షి ఇంటర్న్ షిప్‌కు అదే చివరి రోజు. ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్-పాకిస్తాన్‌పై మ్యాచ్ జరిగిన రోజు. చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి 2010లో డెహ్రాడూన్ సమీపంలోని విక్రాంతి రిసార్ట్‌లో వివాహం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications












