న్యూఢిల్లీ: ఆస్టేలియాలో ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం స్వదేశానికి చేరుకున్న టీమిండియా కెప్టెన్ ధోని ఓ బేబిని ఎత్తుకొని ఉన్న వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తుంది. అభిమానులంతా ఆ చిన్నారి ధోని, సాక్షిలకు ముద్దుల కూతురు 'జివా'నే అనుకుంటూ ట్విట్టర్లో తెగ ట్వీట్స్ చేస్తున్నారు.
<center><iframe width="100%" height="360" src="https://www.youtube.com/embed/X6Sl0gmcDy4?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
విషయం తెలుసుకున్న సాక్షి ధోనితో పాటు ఆ వీడియోలో ఉన్న చిన్నారి మా ముద్దుల కూతురు కాదంటూ అభిమానులకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జీవా స్ధానంలో తప్పుగా ఉన్న పిక్చర్ చెలామణీ అవుతుందని ట్వీట్ చేసారు.
గుర్గావ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిబ్రవరి 6 (శుక్రవారం)నాడు ధోని భార్య ఓ బేబీ గర్ల్‌కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ధోని భార్య సాక్షి సింగ్ తన ముద్దుల కూతురు చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
మార్చి 2న ధోని భార్య సాక్షి సింగ్ తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో తన ముద్దుల కూతురు 'జివా' ఫోటోను ట్వీట్ చేసింది. ఈ ఫోటోలో చిన్నారి జీవా, అమ్మ చేతిని మృదువుగా పట్టుకుని ఉంది. ఈ ఫోటో కింద ధోని భార్య Bundle of Joy !! అని రాసింది. జీవా అనేది పర్షియన్ భాషకు చెందిన పదం. ఈ పదానికి అర్థం 'అందం'.