గర్వపడుతున్నా, పోరాడారు: టీమిండియాపై సాక్షి, ధోనీని చూడబోతున్నానని..
రాంచీ: ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ప్రశంసలు కురిపించింది. మెగా టోర్నీలో టీమిండియా ప్రదర్శన చాలా బాగుందని ట్విట్టర్లో పేర్కొంది. టీమిండియా ఆటగాళ్లు తమ శక్తి సామర్థ్యాల మేరకు రాణించారని తెలిపింది.
'మీరు కొన్ని మ్యాచుల్లో గెలిచారు. కొన్ని ఓడారు' అని పేర్కొన్న సాక్షి సింగ్ ధోనీ.. ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని చెప్పింది. అంతేగా, ఏదైమైనా ఎట్టకేలకు తన భర్తను చూడబోతున్నానని తెలిపింది.

గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో టీమిండియా ఘోర పరాజయంపాలై ఇంటి బాటపట్టిన విషయం తెలిసిందే. సిడ్నీ మైదానంలో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా 328 పరుగులు చేయగా, టీమిండియా 233 పరుగులకు ఆలౌటై ప్రపంచ కప్ నుంచి నిష్ర్కమించింది. టీమిండియాపై గెలిచిన ఆసీస్.. ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
కాగా, టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరికొంత మంది టీమిండియా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications