హైదరాబాద్: తొలిసారి తండ్రి అయిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆ సమయంలో భార్య పక్కనే ఉండాలని, ఆ అద్భుతమైన క్షణాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పుట్టిన బిడ్డను చూసేందుకు ఎంతో ఆతృతతో ఉంటారు. కానీ టీమిండియా మాజీ కెప్టెన మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో మాత్రం అలా జరగలేదు.
అంతేకాదు ధోనీకి కూతురు పుట్టిన విషయం కూడా సురేశ్ రైనా ద్వారా తెలుసుకోవడం విశేషం. ఈ విషయం ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రాసిన 'డెమోక్రసీ 11: ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ' అనే పుస్తకంలో వెలుగు చూసింది. ధోని 2015 వరల్డ్ కప్ సమయంలో తండ్రి అయిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో ధోనీ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కూతురు జీవా పుట్టగానే ఈ విషయాన్ని ధోనీకి చెప్పేందుకు ప్రయత్నించిందట. కానీ అతడు ఫోన్ వెంట తీసుకెళ్లకపోవడంతో సురేశ్ రైనా ద్వారా ఈ విషయాన్ని ధోనికి తెలిసేలా తెలియజేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే ఈ విషయాన్ని పుస్తక పబ్లిషర్ జగ్గర్నాట్ బుక్స్ '2015 ప్రపంచకప్‌లో ధోని తండ్రైన విషయాన్ని సాక్షి.. ధోని మొబైల్ తీసుకెళ్లకపోవడంతో, రైనా మొబైల్ ద్వారా తెలియజేసింది' అని ట్వీట్ చేసింది. ధోని భార్య సాక్షి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జీవాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో టీమిండియా ఆస్ట్రేలియాలో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. వరల్డ్ కప్ అనంతరం భారత్‌కు వచ్చిన ధోనిని 'జీవా పుట్టిన క్షణాలను మిస్ అయ్యారా?' అని మీడియా అడిగిన ప్రశ్నకు లేదని సమాధానమిచ్చాడు. తాను
దేశం కోసం పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వేచి ఉండక తప్పదని అన్నాడు.
కాగా, దురదృష్టవశాత్తూ 2015 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమిపాలైంది. సెమీఫైనల్స్‌లో ధోనిసేన ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.