Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలో న్యూ ఎంట్రీ?

భారత క్రికెట్ జట్టు సపోర్టింగ్ స్టాఫ్ లో కీలక మార్పులు చోటు చేసుకోన్నాయి. స్పిన్ బౌలింగ్ కోసం ప్రత్యేకంగా ఓ కోచ్‌ను నియమించాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పట్టుబట్టాడు. ఈ మేరకు బీసీసీఐకి సిఫార్సు సైతం చేశారు. ఈ పదవికి టీమిండియా మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే పేరును ప్రతిపాదించారు కూడా. బీసీసీఐ ఆమోదం లభిస్తే టీమిండియాలో ప్రత్యేక స్పిన్ కోచ్‌ను నియమించడం ఇదే మొదటిసారి అవుతుంది.

ప్రస్తుతం జట్టు సపోర్టింగ్ స్టాఫ్ లో మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, సితాంశు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. స్పిన్ బౌలింగ్‌కు ప్రత్యేకంగా కోచ్ అంటూ ఎవరూ లేరు. ఈ లోటును పూరించాలని గౌతమ్ గంభీర్ కోరుకుంటున్నారు. గత కొంతకాలంగా భారత స్పిన్నర్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇదే గంభీర్ ప్రధాన ఆందోళన. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్పిన్ దళమైన భారత్.. ఇటీవల సొంతగడ్డపైనే ఇబ్బందులు పడుతోంది.

Sairaj Bahutule Likely Named India s Spin Bowling Coach for Two-Year Stint Ahead of June Afghanistan Series

2024లో న్యూజిలాండ్ భారత్‌ను స్వదేశీ టెస్ట్ సిరీస్‌లో ఓడించి చరిత్ర సృష్టించడమే దీనికి నిదర్శనం. గత ఏడాది భారత్‌లో టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్ వంటి విదేశీ స్పిన్నర్లు మన పిచ్‌లపై మెరుగైన ప్రభావం చూపారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిల ఫామ్ ప్రశ్నార్థకమైంది. ఈ అంశాలన్నీ జట్టు యాజమాన్యాన్ని పునరాలోచింపజేశాయి.

సాయిరాజ్ బహుతులే టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్. ఆయన రెండు టెస్టులు, ఎనిమిది వన్డే ఇంటర్నేషనల్ ఆడారు. టెస్టుల్లో 39 పరుగులు చేసి 3 వికెట్లు, వన్డేల్లో 23 పరుగులుచేసి 2 వికెట్లు సాధించారు. అంతర్జాతీయ కెరీర్ స్వల్పకాలమే అయినా, దేశవాళీ క్రికెట్‌లో ఆయన రికార్డు అద్భుతం. కోచింగ్ పైనా మంచి పట్టు ఉంది. బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీలో కొనసాగుతున్నారు కూడా. ఆయన పలు రంజీ జట్లకు, ఎన్‌సీఏలో యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీలతోనూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ కింగ్స్ (PBKS)కు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం బహుతులే కోచింగ్ పట్ల ప్రభావితులయ్యారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో ద్రవిడ్ బహుతులేను భారత జట్టులో చేర్చుకోవాలని సిఫార్సు చేశారు. శ్రీలంక పర్యటనలోనూ ఆయన టీమిండియా సహాయక సిబ్బందిలో భాగం. ఇప్పుడాయన సేవలను పూర్తిస్థఆయిలో వినియోగించుకోవాలని గంభీర్ ప్రయత్నిస్తోన్నారు.

Story first published: Friday, May 8, 2026, 16:08 [IST]
Other articles published on May 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+