హైదరాబాద్: భారత స్టార్ బ్యాట్సుమెన్ విరాట్ కోహ్లీతో పోల్చితే తన దూకుడు సున్నా అని హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అన్నారు. తాను ఓడిపోవడాన్ని అస్సలు ఇష్టపడనని చెప్పారు. తన దూకుడైన ఆటతీరుకు అదే కారణమని చెప్పారు.
తాను ఎప్పుడూ ఆశలు వదులుకోనని చెప్పారు. చివరిదాకా పోరాడతానన్నారు. బహుశా నేనిలా దూకుడుగా ఆడటానికి ఓడిపోవడం ఇష్ట పడకపోవడమే కారణం కావొచ్చునని చెప్పారు. ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలోనూ అలాగే ఆడానని చెప్పారు.

కోహ్లి కూడా ఆమె ఆటతీరును ఇటీవల మెచ్చుకున్నారు. దీని పైన ఆమె స్పందించింది. కోహ్లితే పోల్చితే తన దూకుడు శూన్యం అని చెప్పారు. ఒలింపిక్స్‌లో పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నానని, బెంగళూరులో కోచ్ విమల్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ బాగా సాగుతోందన్నారు.