ప్రధాని మోడీ బర్త్‌డేకి సైనా బహుమతి ఇదే (ఫోటో)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు ఈరోజు. ఈరోజుతో ఆయన 66వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నిన్న ఆయన్ని ఢిల్లీలో కలిసిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఒక బహుమానాన్ని అందించింది.
సైనా నెహ్వాల్ తాను ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో ఆడిన రాకెట్(బ్యాట్)ను మోడీకి బహూకరించింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. ఆనంతరం మీడియాతో సైనా మాట్లాడుతూ రజత పతకాన్ని సాధించిన రాకెట్‌ను ప్రధానికి బహుమతిగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ ప్రభుత్వం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తుందని చెప్పిన సైనా, పుట్టినరోజుకు ముందుగానే మోడీని కలిసి శుభాకాంక్షవలు తెలిపడం తన అదృష్టమన్నారు. తాను పాల్గొన్న మ్యాచ్‌ల గురించి ప్రధాని మాట్లాడడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
ప్రధానే స్వయంగా మ్యాచ్‌ల గురించి వివరించడం ఎవరిలోనైనా ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని తెలిపింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించినందుకు ప్రధాని మోడీ తనను అభినందించారని చెప్పింది. మోడీని సైనా కలిసినప్పుడు ఆమె తండ్రి హర్వీర్ నెహ్వాల్, ఐఒఎస్ స్పోర్ట్స్ ఎండి, సిఇవో నీరవ్ తోమర్ కూడా ఉన్నారు.
Delhi: Saina Nehwal meets PM Narendra Modi (Source: PMO) pic.twitter.com/dkBSw2aOVR
— ANI (@ANI_news) September 16, 2015 - Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications