Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా ఆరో మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులందరినీ నిరాశపరిచింది. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ నిర్ణయం వారికి ఎంత మాత్రం కలిసిరాలేదు. నిజానికి పరాజయానికి ప్రధాన కారణం వారి వ్యూహాత్మక తప్పిదాలే.
వరుసగా రెండు 'గోల్డెన్ డక్' ఔట్లు
పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలైన వెంటనే అభిమానుల ఆశలపై హార్దిక్ పాండ్యా మొదటి దెబ్బ కొట్టాడు. గత మ్యాచ్‌లో ఒమన్‌పై తొలి బంతికే ఔట్ అయిన యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్.. ఈ మ్యాచ్‌లో కూడా హార్దిక్ పాండ్యా వేసిన మొదటి బంతికే సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌లలో 'గోల్డెన్ డక్'గా ఔటైన చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.

క్రికెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బుమ్రా బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టి ప్రతీకారం తీర్చుకోవాలని అయూబ్ భావించాడట. అయితే, అది జరగకముందే హార్దిక్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుట్ కావడంతో పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో నిశ్శబ్దం ఆవహించింది.
దుబాయ్ పిచ్‌పై తప్పుటడుగు
అయితే నిపుణుల ప్రకారం.. 2021 నుంచి దుబాయ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్ల విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విషయం తెలిసినప్పటికీ.. సల్మాన్ అలీ ఆఘా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవడం ఓ పెద్ద తప్పిదం. దీనికి తోడు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ టాపార్డర్ కుప్పకూలింది. మొదటి బంతికి సయీమ్ ఆయుబ్ ఔట్ కాగా.. ఆ తర్వాత ఓవర్లో బుమ్రా బౌలింగ్ లో భారీ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి.. గత మ్యాచ్‌లో హీరో అయిన మహ్మద్ హారిస్ కేవలం 3 పరుగులకే ఔట్ అయ్యాడు. ఫఖర్ జమాన్ (17 పరుగులు), కెప్టెన్ సల్మాన్ అఘా (3 పరుగులు) కూడా నిరాశపరిచారు. ఫలితంగా, పాకిస్తాన్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారి ఈ పేలవమైన ప్రదర్శనతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకు పరిమితమైంది.
జట్ల వివరాలు:
భారత జట్టు (ప్లేయింగ్ 11):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్ జట్టు (ప్లేయింగ్ 11):
సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీం,అబ్రార్ అహ్మద్.