ఇజ్జత్ పాయే.. పిల్లోడి బంతికి క్లీన్ బౌల్డ్! (వీడియో)
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ బ్యాటర్ సైమ్ అయూబ్‌కు ఓ చిన్న పిల్లోడు షాకిచ్చాడు. నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కేవలం 9 ఏళ్ల వయస్సు ఉన్న ఓ బాలుడు వేసిన బంతికి సైమ్ అయూబ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సైమ్ అయూబ్ ఆ బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. బంతి బ్యాట్‌ను తప్పించుకుంటూ నేరుగా వికెట్లను తాకింది. ఔటైన తర్వాత ఆ పిల్లాడి టాలెంట్‌ను సైమ్ అయూబ్ మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా బంతిపై ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చి తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.
సైమ్ అయూబ్ పాకిస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. 23 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇప్పటివరకు 8 టెస్టులు, 17 వన్డేలు, 67 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో కూడా సైమ్ అయూబ్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఇటీవలి కాలంలో సైమ్ అయూబ్ ఫామ్ ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు తరఫున ఆడిన సైమ్ అయూబ్(12.6 కోట్ల పాకిస్థానీ రూపాయలు) అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచినప్పటికీ.. 13 మ్యాచ్‌ల్లో కేవలం 258 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

మరోవైపు ఆస్ట్రేలియాతో జరగనున్న 3 వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన 28 మంది సభ్యుల వైట్ బాల్ శిక్షణ శిబిరంలో సైమ్ అయూబ్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వన్డేల్లో 47 సగటు ఉన్నప్పటికీ.. అతని పేలవమైన ఫామ్ కారణంగా జట్టు నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే టెస్ట్ జట్టులోనూ అతనికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఓ చిన్న పిల్లాజి బౌలింగ్‌లో అతను బౌల్డ్ అవ్వడం చూసి, నెటిజన్లు పాక్ క్రికెట్ ప్రమాణాలపై సెటైర్లు వేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications