|
సాగరిక సైతం ఇదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ
మరోవైపు సాగరిక సైతం ఇదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ "ముందుగా నీకు ధన్యవాదాలు చెప్పాలి. హ్యాపీ యానివర్సల్ లవ్. చీర్స్ టు ఫరెవర్" అని కామెంట్ పెట్టింది. షారుక్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా' చిత్రంతో సాగరిక బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఫాక్స్', ‘ఇరాదా' లాంటి సినిమాల్లో నటించారు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
ఇక, జహీర్ ఖాన్ విషయానికి వస్తే 2015లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్లో 200 వన్డేలు, 92 టెస్టులు, 17 టీ20లాడిన జహీర్ వన్డేల్లో 282, టెస్టుల్లో 311, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లలో జహీర్ నాలుగోవాడు. అతని కన్నా ముందు అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, అజిత్ అగార్కర్లున్నారు.
|
జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా
ఇటీవలే జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అతని భార్య సాగరిక.. మాల్దీవుల్లో పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి యువరాజ్ సింగ్ తన భార్య హేజిల్ కీచ్‌తో హాజరవగా.. ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఈ హాలీడే ట్రిప్‌లో భాగంగా యువరాజ్, హాజెల్‌తో కలిసి తాను తీసుకున్న ఓ సెల్ఫీని సాగరిక తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.