భారత మాజీ క్రికెటర్ల మధ్య ఫైట్.. యూవీపై ప్రతీకారం తీర్చుకున్న ఓజా! (వీడియో)

రాయ్‌పూర్: భారత మాజీ క్రికెటర్లు సరదాగా కలుసుకోవడానికి రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్ మంచి వేదికైంది. గతేడాది ప్రారంభమైన ఈ సిరీస్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆగిపోయింది. అయితే తాజాగా ఈ నెల 5 నుంచి గతేడాది ఎక్కడైతే ఆగిపోయిందో.. మళ్లీ అక్కడి నుంచే సిరీస్ ప్రారంభం అయింది. ప్రస్తుతం రాయ్‌పూర్‌లో ఉన్న ఇండియా లెజెండ్స్ జట్టు.. ఉల్లాసంగా గడుపుతోంది. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ల మధ్య ఓ ఫైట్ జరిగింది. సరదాగా సాగిన ఈ ఫైట్‌కు సంబంధించిన ఓ వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్ మంగళవారం ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
మాజీ క్రికెటర్ల మధ్య కేక్ ఫైట్:
మాజీ క్రికెటర్ల మధ్య కేక్ ఫైట్ జరిగింది. భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను ఇండియా లెజెండ్స్ జట్టు సభ్యులు పట్టుకోగా.. యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్ పఠాన్‌లు ఓజా ముఖంపై కేక్ పూశారు. యుసుఫ్ అయితే ఓజా ముఖం, జుట్టును కేక్‌తో నింపేసాడు. ఆ వెంటనే కేక్ పూయడానికి ఓజా ప్రయత్నించగా.. ఇర్ఫాన్ పరుగెత్తుకుని తప్పించుకున్నాడు. ఇంతలో ప్రజ్ఞాన్ ఓజా యువరాజ్ సింగ్‌కు కేక్ పూయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మహ్మద్ కైఫ్ యూవీని పట్టుకోగా.. ఓజా అతని ముఖంపై కేక్ పూసి ప్రతీకారం తీర్చుకున్నాడు. యువీ మొదట కాస్త ప్రతిఘటించినా.. కైఫ్ పట్టుకోవడంతో కైఫ్ పని సులువైంది.

సెమీఫైనల్‌కి ఇండియా లెజెండ్స్:
రోడ్ సేప్టీ వరల్డ్ టీ 20 సిరీస్‌లో శనివారం దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ను 56 పరుగుల తేడాతో ఓడించి ఇండియా లెజెండ్స్ సెమీఫైనల్‌కి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం 37 బంతుల్లో 60 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. ఒకే ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది కేవలం 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. మూడు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

6, 6, 6, 6:
దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచులో యువీ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాండర్ బ్రూన్ బౌలింగ్‌లో యువరాజ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. ఈ ఓవర్‌లో మొదటి బంతి డాట్ అవగా.. ఆ తర్వాత యువీ వరుసగా నాలుగు బంతులను 6, 6, 6, 6 రూపంలో స్టాండ్స్‌లోకి తరలించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.

సెహ్వాగ్, ఇర్ఫాన్ మెరుపులు
ఇదే సిరీస్‌లో బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 35 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. వీరూ సాధించిన 80 పరుగుల్లో 70 పరగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించినవే. సెహ్వాగ్‌కు సచిన్ (26 బంతుల్లో 33; 5 ఫోర్లు) దూకుడు కూడా తోడవడంతో ఈ మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ తరువాత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే రీతిలో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయి 34 బంతుల్లో 61 పరుగులతో విజృంభించాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం భారత్ విజయం ముంగిట ఆగిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications