For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అశ్విన్‌పై నిషేధం పడకుండా.. ఆరు నెలలు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంచారు'

Saeed Ajmal feels BCCI protect Ravichandran Ashwin form Ban over suspect bowling action

కరాచీ: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌పై ఆరు నెలల నిషేధం పడకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంచారని అజ్మల్‌ ఆరోపించాడు. ఆ సమయంలో అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ను యాష్ సరిచేసుకున్నాడని అతడు అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్‌మన్‌, బౌలర్కు అనుకూలంగా నిబంధనలు ఉన్నాయని.. భుజం 15 డిగ్రీలు వంపు తిరగాల్సిందేనంటూ స్పిన్నర్లపై ఆంక్షలు పెడుతున్నారని అజ్మల్‌ వెల్లడించాడు.

బీసీసీఐ కాపాడింది

బీసీసీఐ కాపాడింది

క్రిక్‌విక్‌ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సయీద్‌ అజ్మల్‌ మాట్లాడుతూ... 'ఎవర్నీ సంప్రదించకుండానే అన్ని నిబంధనలూ మార్చేస్తారు. గత ఎనిమిదేళ్లుగా క్రికెట్‌ ఆడుతూనే ఉన్నా. ఆ నిబంధలన్నీ నాకే వర్తించాయి. అదే సమయంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆరు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

ఎందుకో చెప్పండి. ఎందుకంటే.. అశ్విన్‌పై నిషేధం పడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాపాడింది. ఆ సమయంలో అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ను అతడు సరిచేసుకున్నాడు. పాక్‌లో ఇలా ఉండదు. ఏ బౌలర్‌పై నిషేధం పడ్డా వారు పట్టించుకోరు. వారికి డబ్బే ముఖ్యం' అని అన్నాడు.

తప్పుడు వార్తలు రాయొద్దు:

తప్పుడు వార్తలు రాయొద్దు:

దూస్రాలు విసిరేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 15 డిగ్రీల నిబంధనను పక్కన పెట్టాలని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ కోరినట్టు ఈ మధ్యే వార్తలు రావడం గమనార్హం. అయితే తానెప్పుడూ అలా కోరలేదని, అవన్నీ అవాస్తవాలని యాష్‌ స్పష్టం చేశాడు.

తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అభిమానులకు సరైన అంశాలు, మెరుగైన క్రికెట్‌ విశ్లేషణ అందించడమే లక్ష్యమని పేర్కొన్నాడు. అనువాదం సరిగ్గా రానప్పుడు తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాకు అశ్విన్‌ సూచించాడు. అశ్విన్ 78 టెస్టుల్లో 24.69 సగటుతో 409 వికెట్లు పడగొట్టాడు.

WTC Final: టీమిండియా బ్యాట్స్‌మెన్‌.. పాత సినిమాల్లో పోలీసులు చేసిందే చేయండి!!

78 టెస్టుల్లో 409 వికెట్లు

78 టెస్టుల్లో 409 వికెట్లు

ఇప్ప‌టి వ‌ర‌కూ 78 టెస్టుల్లో 409 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్.. కెరీర్‌లో మొత్తం 30 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఏడుసార్లు 10 వికెట్ల ప్రదర్శన ఉంది. అయితే సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మాత్రం ఒక్క‌సారి కూడా అశ్విన్ ఐదు వికెట్లు తీయ‌లేక‌పోడు.

ఇక భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా సమరం కోసం యాష్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో అతడికి కచ్చితంగా చోటుదక్కనుంది.

Story first published: Tuesday, June 15, 2021, 13:28 [IST]
Other articles published on Jun 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+