For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ మైదానంలోకి సచిన్, యువీ.. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Masters League Cricket 2025: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సచిన్, యువరాజ్ సింగ్, కుమార సంగక్కర, బ్రియాన్ లారా, క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్ లాంటి సీనియర్లు మరోసారి మైదానంలో ఆడుతూ అభిమానులను ఉత్సాహపరచనున్నారు. నిజమేనండోయ్.. క్రికెట్ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు మరో టోర్నీ సిద్ధమైంది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్ భారత్-శ్రీలంక జట్ల మధ్య నేడు జరగనుంది. ఈ మ్యాచ్ నేడు 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో సచిన్, యువీల బ్యాటింగ్ ను ఆస్వాదించవచ్చు. ఈ మ్యాచ్ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రోజు జరగనుంది.

ఈ టోర్నమెంట్ లో టీమిండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తుండగా.. మరో సారి సచిన్ బ్యాటింగ్ ను చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ జట్టులో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. దశాబ్ధ కాలం తర్వాత సచిన్-యువీ ద్వయం టీమిండియా జెర్సీ ధరించి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ఐకానిక్ మ్యాచ్ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Sachin Yuvraj Back on the Field International Masters League 2025 Starts Today

ఈ ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ టోర్నమెంట్ ఫిబ్రవరి 22న ప్రారంభమై.. చివరి మ్యాచ్ మార్చి 16న జరుగుతుంది.ఈ మ్యాచ్ లు 3 వేదికలలో జరుగుతాయి. తొలి 5 మ్యాచ్ లు నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో షెడ్యూల్ చేశారు. ఆ తర్వాతి మ్యాచ్ లు వడోదరలోని రిలయన్స్ స్డేడియంలో నిర్వహిస్తారు. సెమీస్, ఫైనల్ మ్యాచ్ లకు రాయపూర్ లోని షహీర్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ లో ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, ఇంగ్లాండ్ మాస్టర్స్, దక్షిణాఫ్రికా మాస్టర్స్ అనే ఆరు జట్లు పాల్గొననున్నాయి.

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడవచ్చు?
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మ్యాచ్ లను డిస్నీ+హాట్ స్టార్(జియోస్టార్), కలర్స్ సినీప్లెక్స్, కలర్స్ సినీప్లెక్స్ సూపర్ హిట్స్ ద్వారా లైవ్ లో మ్యాచ్ లను ప్రత్యక్షప్రసారం ద్వారా చూడవచ్చు. అన్ని మ్యాచ్ లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఆరు జట్లు ఇవే..
ఇండియా మాస్టర్స్ జట్టు: సచిన్ టెండూల్కర్(కెప్టెన్), యువరాజ్ సింగ్, సురేష్ రైనా, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టూవర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి, వినయ్ కుమార్, షాబాజ్ నదీమ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, పవన్ నేగి, గుర్కీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్.

శ్రీలంక మాస్టర్స్ జట్టు: కుమార సంగక్కర, రొమేష్ కలువితరణ, అషాన్ ప్రియంజన్, ఉపుల్ తరంగ, నువాన్ ప్రదీప్, లాహిరు తిరిమన్నే, చింతక జయసంఘే, సీకుగే ప్రసన్న, జీవన్ మెండిస్, ఇసురు ఉదాన, ధమ్మిక ప్రసాద్, సురంగ లక్మల్, దిల్రువాన్ పెరెరా, అసెల గుణరత్నే, చతురంగ డిసిల్వా.

వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు: బ్రియాన్ లారా (కెప్టెన్), క్రిస్ గేల్, కిర్క్ ఎడ్వర్డ్స్, లెండిల్ సిమ్మన్స్, నర్సింగ్ డియోనరైన్, ఆష్లే నర్స్, డ్వేన్ స్మిత్, చాడ్విక్ వాల్టన్, దినేష్ రామ్దిన్, విలియమ్స్ పెర్కిన్స్, ఫేడెన్ ఎడ్వర్డ్స్, జెరోమ్ టేలర్, రవి రాంపాల్, సులీమాన్ బెన్, టినో బెస్ట్

ఆస్ట్రేలియా మాస్టర్స్: కల్లమ్ ఫెర్గూసన్, నాథన్ రియర్డన్, షాన్ మార్ష్, బెన్ కటింగ్, డాన్ క్రిస్టియన్, షేన్ వాట్సన్, బెన్ డంక్, పీటర్ నెవిల్లే, బెన్ హిల్ఫెన్‌హాస్, బెన్ లాఫ్లిన్, బ్రైస్ మెక్‌గెయిన్, జేమ్స్ ప్యాటిన్సన్, జాసన్ క్రెజా, నాథన్ కౌల్టర్-నైల్, జేవియర్ డోహెర్టీ

ఇంగ్లాండ్ మాస్టర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఇయాన్ బెల్, కెవిన్ పీటర్సన్, డారెన్ మాడ్డీ, డిమిట్రియోస్ మస్కరెన్హాస్, టిమ్ బ్రెస్నన్, ఫిల్ మస్టర్డ్, టిమ్ అంబ్రోస్, బాయ్డ్ రాంకిన్, క్రిస్ స్కోఫీల్డ్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, ర్యాన్ సైడ్‌బాటమ్, స్టీవ్ ఫిన్, స్టువర్ట్ మీకర్

దక్షిణాఫ్రికా మాస్టర్స్: అల్విరో పీటర్సన్, ఫర్హాన్ బెహార్డియన్, హషీమ్ ఆమ్లా, హెన్రీ డేవిడ్స్, జాక్వెస్ రుడాల్ఫ్, జాంటీ రోడ్స్, జాక్వెస్ కల్లిస్, జెపి డుమిని, వెర్నాన్ ఫిలాండర్, డేన్ విలాస్, మోర్నే వాన్ వైక్, ఎడ్డీ లీ, గార్నెట్ క్రుగర్, మఖాయ ఎన్టిని, థాండి త్షబలాలా

Story first published: Saturday, February 22, 2025, 10:56 [IST]
Other articles published on Feb 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+