న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలిసారి అప్పుడే చూశా: టైమ్ మ్యాగజైన్ కోసం కోహ్లీ ప్రొఫైల్‌ రాసిన సచిన్

By Nageshwara Rao
Sachin Tendulkar writes Virat Kohlis profile in TIMEs 100 most influential people list: Here is what he said

హైదరాబాద్: 2018 సంవత్సరానికి గాను ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగిజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ఉన్నారు.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్, శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. టైమ్ మ్యాగజైన్‌లో కోహ్లీకి సంబంధించిన ప్రొఫైల్‌ను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రాయడం మరో విశేషం. ఈ సందర్భంగా కోహ్లీలో ఓ చాంపియన్‌ను చూస్తున్నానని, ఎప్పటికైనా అత్యున్నత శిఖరాలు అందుకుంటాడని తాను ముందే ఊహించానని సచిన్ చెప్పాడు.

 అప్పుడే విరాట్ కోహ్లీని తొలిసారి చూశా

అప్పుడే విరాట్ కోహ్లీని తొలిసారి చూశా

'2008 అండర్ 19 వరల్డ్‌కప్ ఇండియాకు చాలా ముఖ్యం. ఆ టీమ్ నుంచి భవిష్యత్తు టీమిండియా స్టార్స్ వస్తారని తెలుసు. ఆ సమయంలోనే తొలిసారి నేను విరాట్ కోహ్లీని చూశాను. ఇప్పుడు కోహ్లీ దేశంలోని ప్రతి ఇంటికీ తెలుసు. క్రికెట్‌లో అతడో చాంపియన్. పరుగుల కోసం అతను పడుతున్న ఆరాటం, అతని నిలకడ అద్భుతం. అదే ఇప్పుడు కోహ్లీని ఈ స్థాయిలో నిలబెట్టింది' అని సచిన్ రాశారు.

విమర్శకుల నోళ్లు మూయించడంలోనూ కోహ్లీ ఆరితేరాడు

విమర్శకుల నోళ్లు మూయించడంలోనూ కోహ్లీ ఆరితేరాడు

ఓ చాంపియన్‌లా సక్సెస్‌ను ఎలా చూస్తున్నాడనేదే కాదు.. వైఫల్యాలనూ ఎలా దీటుగా ఎదుర్కొంటున్నాడన్నదానిపైనే ఆధారపడి ఉంటుందని సచిన్ చెప్పాడు. 'తన ఆటతో విమర్శకుల నోళ్లు మూయించడంలోనూ కోహ్లీ ఆరితేరాడు. మనం ఏం చేస్తున్నామో దానిపైనే పూర్తిగా దృష్టి సారిస్తే మనల్ని అడ్డుకునేవాళ్లు కూడా మన ఫాలోవర్స్‌గా మారిపోతారు అని మా నాన్న ఎప్పుడూ నాకు చెబుతుండేవారు' అని సచిన్ పేర్కొన్నారు.

వెస్టిండీస్ పర్యనటలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న కోహ్లీ

వెస్టిండీస్ పర్యనటలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న కోహ్లీ

'ఆట పరంగా చూస్తే విరాట్ కోహ్లీ కూడా అలాగే కనిపిస్తాడు. వెస్టిండీస్ పర్యనటలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ... భారత్‌కు తిరిగి రాగానే తన టెక్నిక్‌తోపాటు ఫిట్‌నెస్ లెవల్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. కోహ్లీ ఇలాగే సక్సెస్ సాధించాలని, ఇండియాకు మరింత గొప్పపేరు తీసుకురావాలి' అని సచిన్ కొనియాడాడు.

తొలి స్థానం దక్కించుకున్న హాలీవుడ్ నటి నికోల్ కిడ్‌మన్

తొలి స్థానం దక్కించుకున్న హాలీవుడ్ నటి నికోల్ కిడ్‌మన్

టైమ్ మ్యాగజైన్‌లో ప్రకటించిన జాబితాలో హాలీవుడ్ నటి నికోల్ కిడ్‌మన్ తొలి స్థానం దక్కించుకున్నారు. హ్యూగ్ జాక్‌మెన్, న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. వీరితోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తోపాటు నటి జెన్నీఫర్ లోపేజ్, బ్రిటన్‌ రాకుమారుడు హ్యారీ, ఆయనకు కాబోయే భార్య మేఘన్‌ మార్కెల్‌, లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలకు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు.

 సత్య నాదెళ్ల గురించి తులానె యూనివర్శిటీ ప్రొఫెసర్

సత్య నాదెళ్ల గురించి తులానె యూనివర్శిటీ ప్రొఫెసర్

ఈ ఏడాది అత్యంత ప్రభావశీలురు జాబితాలో 45 మంది మహిళలు ఉన్నారు. నటి మిల్లీ బాబీ బ్రౌన్‌ (14) అత్యంత పిన్న వయస్కురాలు. దీపికా పదుకొణె ప్రొఫైల్‌ రాసిన హాలీవుడ్‌ నటుడు విన్‌ డీజిల్‌.. ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. సత్య నాదెళ్ల ఘనతలను అమెరికాలోని తులానె యూనివర్శిటీ ప్రొఫెసర్ వాట్లర్‌ ఇసాక్సన్‌ రాశారు. మేఘన్‌ మార్కెల్‌ ప్రొఫైల్‌ను బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా రాశారు.

Story first published: Friday, April 20, 2018, 18:31 [IST]
Other articles published on Apr 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X