బర్మింగ్ హామ్: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ చైనా అడ్డుగోడలను అధిగమించి టైటిల్ పోరుకు సిద్ధమై చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో సైనాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ విషెస్ చెప్పారు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించిన సైనా.. ఆ ప్రతిష్టాత్మక టైటిల్ సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. సైనాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ టోర్నీలో సైనా నెహ్వాల్ ఆరో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనున్నారు. ఆల్ ఇండియా టోర్నీలో ఎనిమిదిసార్లు పాల్గొన్న సైనా రెండుసార్లు సెమీస్‌కు వెళ్లారు.

సైనా నెహ్వాల్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భారత మహిళా షట్లర్‌గా నిలిచింది. 2010, 2013లో సెమీస్‌లోనే నిష్క్రమించిన సైనా ఈసారి మాత్రం టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.