For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ గెలిచిన ఒకే ఒక్క సఫారీ క్రికెటర్: కిర్‌స్టెన్‌పై సెహ్వాగ్ బర్త్ డే ట్వీట్

ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, 2011 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ గురువారం తన 50వ పుట్టినరోజుని జరుపుకున్నాడు.

By Nageshwara Rao
Sachin Tendulkar wishes India's World Cup 2011 winning coach Gary Kirsten a happy birthday

హైదరాబాద్; ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, 2011 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ గురువారం తన 50వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన పలువురు క్రికెటర్లు అతడికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

గ్యారీ కిర్‌స్టెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా తదితరులు ఉన్నారు. 'చాలా ఏళ్ల మనం క‌లిసి క్రికెట్‌ను ఆస్వాదించాం. నువ్వో అద్భుత‌మైన కోచ్. మాలో స్ఫూర్తిని నింపావ్‌. మ‌రీ ముఖ్యంగా నువ్వో చ‌క్క‌టి మిత్రుడివి. హ్యాపీ బ‌ర్త్ డే' అంటూ స‌చిన్ పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

'హ్యాపీ బ‌ర్త్ డే కిర్‌స్టెన్, నువ్వు చ‌క్క‌టి ఓపెనర్‌వే కాదు. స్ఫూర్తిని నింపే కోచ్‌వి కూడా. ప్ర‌తి భార‌తీయుడి క‌ల‌ను సాకారం చేయ‌డంలో నీ తోడ్పాటు ఎంతో ఉంది' అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.

ఇక, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ తనదైన శైలిలో గ్యారీ కిర్‌స్టెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'ఓ అద్భుతమైన మనిషి, ఓ అద్భుమైన కోచ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలిచిన దక్షిణాఫ్రికా క్రికెటర్' అంటు సెహ్వాగ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో కూడిన ఇమేజిని పోస్టు చేశాడు.

ఇదిలా ఉంటే 2008 నుంచి 2011 వ‌ర‌కు టీమిండియా విజ‌యాల్లో గ్యారీ కీల‌క‌పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ గ‌డ్డపై భార‌త జ‌ట్టు తొలిసారి సిరీస్ గెలుపొందండంలో కిర్‌స్టెన్ కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా 2011లో ధోని నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు సొంత గ‌డ్డ మీద ప్ర‌పంచ క‌ప్ ముద్దాడ‌టంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 24, 2017, 21:22 [IST]
Other articles published on Nov 24, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+