అరుదైన గౌర‌వం.. లారెస్ అవార్డు అందుకున్న స‌చిన్‌!!

Sachin Tendulkar Creates Best Sporting Moment || Oneindia Telugu

బెర్లిన్‌: భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌర‌వం దక్కింది. ప్రతిష్ఠాత్మక లారెస్‌ స్పోర్ట్స్‌ మూమెంట్‌ 2000-2020 అవార్డును టెండూల్కర్‌ సొంతం చేసుకున్నారు. 19 మందితో పోటీప‌డిన స‌చిన్‌ అగ్ర‌స్థానంలో నిలిచి లారెస్‌ అవార్డును ద‌క్కించుకున్నారు. భారత క్రికెట్ అభిమానుల మద్దతుతో సచిన్ అత్యధిక ఓట్లు సాధించి సోమవారం విజేతగా నిలిచారు. గత ఇరవై ఏళ్లలో క్రీడా చరిత్రలో మధురమైన ఘట్టాలకు సంబంధించి లారెస్‌ ఫౌండేషన్‌ పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే.

స్టీవ్ వా చేతుల మీదుగా:

స్టీవ్ వా చేతుల మీదుగా:

బెర్లిన్‌లో సోమవారం జరిగిన లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డును ప్రాధానోత్సవంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, టెన్నిస్ లెజెండ్ బోరిస్ బెకర్‌తో సచిన్ టెండూల్కర్ వేదికను పంచుకున్నారు. బెకర్ విజేతను ప్రకటించగా.. స్టీవ్ వా టెండూల్కర్‌కు ట్రోఫీని అందజేశారు. 'ఇది నమ్మశక్యం కాని విషయం. ప్రపంచకప్ గెలిచిన క్షణం కంటే గొప్పగా ఉంది. చాలా అరుదుగా దేశం మొత్తం ఇలా సంబరాలు జరుపుకుంటుంది' అని ట్రోఫీ అందుకున్న తరువాత టెండూల్కర్ అన్నారు.

నా జీవితంలో గర్వించదగ్గ క్షణం:

నా జీవితంలో గర్వించదగ్గ క్షణం:

'క్రీడ ఎంత శక్తివంతమైనదో, అది మన జీవితంలో ఏ విధంగా మ్యాజిక్ చేస్తుందో మరోసారి గుర్తు చేసింది. ఇప్పుడు కూడా ఆట నాతోనే ఉన్నట్టు అనిపిస్తోంది. 1983లో నేను 10 సంవత్సరాల వయసులో ఉన్నపుడు నా ప్రయాణం ప్రారంభమైంది. భారతదేశం ప్రపంచకప్ గెలిచినప్పుడు దాని ప్రాముఖ్యత అర్థం కాలేదు. కానీ.. అందరూ సంబరాలు చేసుకుంటున్నందున నేను కూడా చేసుకున్నా. అయితే దేశానికి ఏదో ఒక ప్రత్యేకత జరిగిందని మాత్రం అర్ధమయింది. ప్రపంచకప్ గెలవడం నా జీవితంలో గర్వించదగ్గ క్షణం. 22 సంవత్సరాల ఆటలో ట్రోఫీని అందుకున్నా' అని సచిన్ తెలిపారు.

 భుజాలపై ఎత్తుకొని:

భుజాలపై ఎత్తుకొని:

ఏప్రిల్‌ 2, 2011న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 28 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్‌ను అందుకోవడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులకు ప్రత్యేక క్షణంగా నిలిచింది. ముఖ్యంగా సీనియర్‌ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌కు అది మరింత ప్రత్యేకం. ఎందుకంటే అప్పటికి ఆరుసార్లు మెగా టోర్నీలో పాల్గొన్నా నిరాశే ఎదురైంది కాబట్టి. టీమిండియా ప్రపంచకప్‌ గెలిచాక సచిన్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని వాంఖడే మైదానమంతా తిప్పిన దృశ్యం ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోరు. దాదాపు తొమ్మిదేండ్ల తర్వాత ఆ సందర్భం ప్రతిష్ఠాత్మక లారియస్‌ అవార్డును తెచ్చిపెట్టింది.

20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా:

20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా:

ప్రపంచ క్రీడా రంగంలో లారెస్‌ స్పోర్టింగ్‌ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. మొనాకోకు చెందిన 'లారెస్‌ స్పోర్ట్‌ ఫర్‌ గుడ్‌ ఫౌండేషన్‌' క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లు, జట్లకు ప్రతి ఏటా అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ సంస్థ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా.. 'లారెస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ 2000-2020' అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. గత రెండు దశాబ్దాల్లో క్రీడారంగంపై ముద్రవేసిన 20 అరుదైన ఘటనలలో భాగస్వాములైన ఆటగాళ్లతో లారెస్‌ ఓ జాబితా రూపొందించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, February 18, 2020, 9:19 [IST]
Other articles published on Feb 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X