
హైదరాబాద్: సచిన్ మంగళవారం 45వ జన్మదినం జరుపుకోనున్నాడు. ఈ నేపథ్యంలో.. 'ఎలెవన్ గాడ్స్ అండ్ ఏ బిలియన్ ఇండియన్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా అతడు కేక్ కట్‌చేసి భార్య అంజలికి తినిపించాడు. 45వ వసంతంలోకి అడుగుపెట్టిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీకి సవాలు విసిరాడు. వన్డేల్లో తన 49 సెంచరీల రికార్డును కెప్టెన్ కోహ్లీ బద్ద్ధలుగొడితే అతడితోపాటు తాను షాంపేన్ సేవిస్తానని సచిన్ చెప్పాడు.
క్రీడా పాత్రికేయుడు బోరియా మజుందార్ రచించిన 'ఎలెవన్ గాడ్స్ అండ్ ఏ బిలియన్ ఇండియన్స్' పుస్తకావిష్కరణ సందర్భంగా సచిన్ మాట్లాడాడు. ప్రస్తుతం వన్డేల్లో 35 సెంచరీలతో ఉన్న కోహ్లీ.. సచిన్ రికార్డును అధిగమించే అవకాశముంది. ఇదే విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సచిన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 'విరాట్ 50 సెంచరీలు కొడితే, 50 షాంపేన్ బాటిళ్లు అతనికి పంపుతారా' అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. 'విరాట్ నా రికార్డును బద్దలుగొడితే అతడికి షాంపేన్ బాటిల్స్ పంపను. నేనే వెళ్లి అతడితో కలిసి షాంపేన్ తాగుతా' అని సచిన్ బదులిచ్చి అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు.
మొదట వన్డేలతో ఇంగ్లండ్‌లో మేలు: రవిశాస్త్రి
ఇంగ్లాండ్ పర్యటనలో తొలుత వన్డేలు ఆడడం జట్టుకు మేలు చేస్తుందని టీమిండియా కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. మొదట వన్డేల్లో తలపడడం ద్వారా.. ఐదు టెస్ట్‌ల సిరీస్ కు ముందు అక్కడి పరిస్థితులకు జట్టు బాగా అలవాటుపడుతుందని వివరించాడు. వచ్చే జూలై 3 నుంచి సెప్టెంబరు 11వరకూ జరిగే సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీసేన ఐదు టెస్ట్‌లు, మూడు వన్డేలతోపాటు మరోమూడు టీ20ల పూర్థిస్థాయి సిరీస్‌లో పాల్గొననుంది.
బాల్ టాంపరింగ్ ఉదంతంలో స్మిత్, వార్నర్, బాన్ క్రాప్ట్ నిషేధం ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. భారత్‌తో రాబోయే సిరీస్‌కు ఆస్ట్రేలియా సాధ్యమైనంత త్వరగా సన్నద్ధం కావాల్సి ఉంటుందని క్లార్క్ అన్నాడు.