Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దొడ్డ గణేష్‌తో విచిత్ర పరిస్థిని ఎదుర్కొన్నా!: సచిన్ టెండూల్కర్

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానంలో వేలకొద్దీ పరుగులు, లెక్కనేనన్ని రికార్డులు నెలకొల్పాడు. తన క్రికెట్ జీవితంలో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు.

బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సచిన్ తను సారథ్యం వహించిన రోజుల్లో హిందీ, ఇంగ్లీష్‌ భాష రాని సహచరులతో ఎలా ఇబ్బంది పడ్డాడో చెప్పుకొచ్చాడు. 1997లో సచిన్‌ టెండూల్కర్ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించింది.

Sachin Tendulkar: When Sachin Tendulkar overcame language barrier with Dodda Ganesh

ఈ పర్యటనలో జట్టు సభ్యుడిగా ఉన్న కర్ణాటక బౌలర్‌ దొడ్డ గణేష్‌కు కన్నడ తప్ప ఇంకే భాష రాదు. ఇలాంటి సందర్భంలో సచిన్‌ పడరాని పాట్లే పడ్డాడంట. అయితే గణేష్‌ మాత్రం సచిన్‌ ఏమని అడిగిన... ఏం చెప్పినా... 'ఓకే సార్‌' అనేవాడంట.

'దీంతో నాకు అర్థమైందేమిటంటే... నేనేం చెప్పిన అతనిచ్చే సమాధానం 'ఓకే సార్‌'. పదేపదే అలా అనడంతో నేనోసారి నన్ను సార్‌ అని పిలవొద్దని చెప్పా. విచిత్రంగా దానిని కూడా అతనిచ్చిన సమాధానం 'ఓకే సార్‌' అని చెప్పడంతో విసిగెత్తిపోయానని సచిన్ అన్నాడు.

ఈ క్రమంలో ఒకే దేశానికి చెందిన మేమిద్దరం భాష అర్ధం కాక సతమతమవుతుంటే దొడ్డ గణేష్, దక్షిణాఫ్రికా పేసర్ డొనాల్డ్‌తో గొడవ పెట్టుకున్నాడు. 'వెంటనే నేను వెళ్లి నీవు ఎం చెప్పాలనుకున్నా ముందు నాకు అర్థమయ్యేలా చెబితే... నేను డొనాల్డ్‌కు వివరిస్తాను అని చెప్పా. దీనికీ ఓకే సార్‌ అనే సమాధానమే' అని సచిన్‌ వివరించారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+