Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ మైనపు బొమ్మ అవిష్కరణ

Sachin Tendulkar
ముంబయి: ముంబయిలోని ఒక హోటల్లో భారత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మ ఆవిష్కరణ జరిగింది. టెండూల్కర్ తన మైనపు బొమ్మను తానే ఆవిష్కరించుకున్నాడు. మేడం టూస్సాడ్స్ లో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయ క్రీడాకారుడు ఆయనే కావడం విశేషం. సచిన్ మైనపు విగ్రహాన్ని మేడం టూస్సాడ్స్ లో ప్రదర్శనకు పెడతారు.

తనకు ఇది ఎంతో ఆనందాన్నిస్తోందని సచిన్ టెండూల్కర్ విగ్రహాష్కణ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. దీన్ని ప్రత్యేకంగా తాను పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేనికీ తాను అంతగా స్పందించబోనని, అయితే మైనపు విగ్రహం విషయంలో మాత్రం ఎంతగానో ప్రతిస్పందించానని ఆయన చెప్పారు. తన ఫీలింగ్స్ ను మాటల్లో చెప్పలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. తనకు సంబంధించినంత వరకు ఇది ప్రత్యేకమైందని ఆయన అన్నారు. ఈ నెల 24వ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా మైనపు విగ్రహాన్ని ప్రదర్సనశాలలో ఉంచుతారు. మైనపు విగ్రహాం తయారీకి ఇటీవలే ముంబయిలో సచిన్ టెండూల్కర్ కొలతలు తీసుకున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+