For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్విటర్‌కు సచిన్‌ ఫిర్యాదు: అన్నీ ఫేక్ అకౌంట్లు.. చర్యలు తీసుకోండి!!

Sachin Tendulkar Serious On Twitter Fake Account Of Son Arjun Tendulkar || Oneindi Telugu
Sachin Tendulkar Warns Of Fake Account With Sons Name Posting Malicious Tweets

ముంబై: కూతురు సారా, కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌లు ట్విటర్‌లో లేరని.. వారి పేరు మీద సోషల్‌ మీడియాలో ఉన్న అకౌంట్లన్ని నకిలీవని భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్పష్టం చేశారు. నకిలీ ఖాతాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ను సచిన్ కోరారు. వెంటనే స్పందించిన ఆ సంస్థ.. నకిలీ అకౌంట్‌ను సస్పెండ్‌ చేసింది.

అన్నీ ఫేక్ అకౌంట్లు:

అన్నీ ఫేక్ అకౌంట్లు:

బుధవారం సచిన్‌ మాట్లాడుతూ... 'నా కూతురు సారా, కుమారుడు అర్జున్‌కు ట్విటర్లో ఎటువంటి ఖాతాలు లేవు. వారి పేరు మీద సోషల్‌ మీడియాలో ఉన్న అకౌంట్లన్ని నకిలీవే. నకిలీ ఖాతాలలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి' పేర్కొన్నారు. సచిన్ వివరణతో సారా, అర్జున్‌లకు ఎటువంటి ట్విటర్ ఖాతాలు లేవని స్పష్టం అయింది.

అర్జున్‌ పేరుతో నకిలీ ఖాతా:

అర్జున్‌ పేరుతో నకిలీ ఖాతా:

ఏడాదిన్నరగా అర్జున్‌ పేరిట నకిలీ ఖాతా నడుస్తుండడం గమనార్హం. @జూనియర్‌-టెండూల్కర్‌ పేరు మీద ఎవరో అర్జున్‌ లాగా ఖాతా తెరిచారు. అందులో వ్యక్తులకు, సంస్థలకు వ్యతిరేకంగా హానికరమైన పోస్టులు చేస్తున్నారు. ఈ ఖాతాలో 'లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌' అని ఉంది. 2018 జూన్‌ నుంచి జూనియర్‌ టెండూల్కర్‌ పేరిట యాక్టివ్‌గా ఉన్న ఈ అకౌంట్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌, కవర్‌ ఇమేజ్‌గా అర్జున్‌ ఫొటోను వాడుతున్నారు.

జట్టు గెలుపు కోసం ఆడట్లేదు:

జట్టు గెలుపు కోసం ఆడట్లేదు:

దేశవాళీ క్రికెట్‌ టోర్నీ దులీప్‌ ట్రోఫీలో చాలామంది ఆటగాళ్లు జట్టు గెలుపు కోసం కాకుండా.. వ్యక్తిగత ప్రదర్శనకే ప్రాధాన్యమిస్తున్నారని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో సచిన్‌ అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీని సంస్కరించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నాడు. రంజీలో సెమీఫైనల్‌కు వెళ్లిన నాలుగు జట్లతో పాటు అండర్‌-19, అండర్‌ -23 జట్లను ట్రోఫీలో ఆడించాలని సూచించారు.

Story first published: Thursday, November 28, 2019, 10:23 [IST]
Other articles published on Nov 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+