For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషీ కపూర్ సినిమాలు చూస్తూ పెరిగా.. ఆయన మరణవార్త విని షాక్ అయ్యా: సచిన్

Sachin Tendulkar, Virender Sehwag, Virat Kohli and others to condole Rishi Kapoor death

ముంబై: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన వార్త నుంచి తేరుకొకముందే మరో వార్త భారత సినీ రంగాన్ని కుదిపేసింది. దిగ్గజ నటుడు రిషీ కపూర్ (67) మరణించారు. చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. రిషీ కపూర్ మరణంపై పలువురు ప్రధాని న‌రేంద్ర ‌మోదీ ట్విట్ట‌ర్ ద్వారా నివాళులు అర్పించారు. మరోవైపు భారత క్రికెటర్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

'రిషీ కపూర్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన మరణవార్త చాలా బాధకలిగింది. ఇన్ని సంవత్సరాల్లో ఆయన్ని ఎప్పుడు కలిసినా.. ప్రేమతో మాట్లాడేవారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. నీతు గారికి, రన్‌బీర్, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేసాడు.

'ఇది అవాస్తవం, నేను నమ్మలేకపోతున్నా. నిన్న ఇర్ఫాన్ ఖాన్, ఈ రోజు రిషీ కపూర్. ఆ దిగ్గజం చనిపోయాడనే విషయాన్ని అంగీకరించడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

Sachin Tendulkar, Virender Sehwag, Virat Kohli and others to condole Rishi Kapoor death

'రిషీ కపూర్ మరణవార్త విని షాక్ అయ్యాను. ఆయన కుటుంబానికి, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి' అని ఓపెనర్ శిఖర్ ధావన్ ట్వీటాడు.

'రిషీ కపూర్ మరణవార్త నా గుండెను కలచివేస్తోంది. ఆయనకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి' అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేసాడు.

'ఇది నిజంగా ఓ గుండె పగిలే వార్త. నాకు మాటలు రావట్లేదు. రిషీ కపూర్‌జీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా అన్నాడు.

'ఈ వార్త విని నిజంగా షాక్ అయ్యాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని టెస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ట్వీట్ చేసాడు.

రిషీ క‌పూర్‌కు టాలెంట్ మాత్ర‌మే కాదు.. లుక్స్ అట్రాక్టివ్‌గా ఉంటాయి. అమ్మాయిల మ‌న‌సు దోచిన హీరో. రొమాంటిక్ హీరోగా రిషీ దాదాపు బాలీవుడ్‌లో 25 ఏళ్లు చెల‌రేగిపోయారు. ఆ త‌ర్వాతే క్యారెక్ట‌ర్ రోల్స్‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. సుదీర్ఘ‌మైన అత‌ని కెరీర్‌లో.. ఎన్నో ల‌వ్లీ సాంగ్స్ ఉన్నాయి. ఎంతో మంది హీరోయిన‌ట్ల‌తో అత‌ను సెప్టెలేశారు. బాలీవుడ్‌లో రిషీకి ప్ర‌త్యేక హిస్ట‌రీ ఉంది. చాక్లెట్‌బాయ్ రిషీ సుమారు 45 మంది హీరోయిన్ల‌తో సినిమాలు తీసిన‌ట్లు తెలుస్తోంది.

Story first published: Thursday, April 30, 2020, 12:53 [IST]
Other articles published on Apr 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+