కోహ్లీ నుంచి సచిన్ వరకు: చరిత్ర సృష్టించిన మిథాలీపై ఇలా
హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డుని సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.
అంతేకాదు మహిళల వన్డేలో 6 వేలకు పైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అంతకుముందు ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్‌వర్డ్స్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. మిథాలీ 183 మ్యాచ్‌ల్లో 6028 పరుగులు చేయగా, ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్‌వర్డ్స్ 191 మ్యాచ్‌ల్లో 5992 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌కి ముందు ప్రపంచ రికార్డు సాధించేందుకు గాను మిథాలీకి 34 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో పెర్రీ బంతిని కవర్స్‌లోకి నెట్టి రికార్డును అందుకుంది. ఇక లెగ్ బ్రేక్ బౌలర్ బీమ్స్ బంతిని భారీ సిక్సర్‌గా మలిచి ఆరువేల పరుగుల మైలురాయిని చేరుకుంది.
ప్రపంచ రికార్డు సాధించిన మిథాలీపై పలువురు క్రికెటర్లు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
కెప్టెన్ కోహ్లీ
మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించడం గొప్ప క్షణాలు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
సచిన్ టెండూల్కర్
‘వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీకి అభినందనలు. ఈ రోజు ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుతం' అని సచిన్ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు.
గౌతమ్ గంభీర్
‘భారత్ పరుగుల మెషిన్' అంటూ గౌతమ్ గంభీర్ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు.
అనిల్ కుంబ్లే
మిథాలీరాజ్ అత్యధిక పరుగులు సాధించడం అనందంగా ఉందని కుంబ్లే ట్వీట్ చేశారు.
వీవీఎస్ లక్ష్మణ్
'ఆరువేల పరుగులు చేసిన మిథాలీకి అభినందనలు' అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications