న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sachin Tendulkar: వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచి 11 ఏళ్ల‌యింది.. ఈ సారి రోహిత్, ద్రావిడ్ గెల‌వాలి

Sachin Tendulkar urges Rohit Sharma and Rahul Dravid to win World Cup

టీమిండియాలో ర‌విశాస్త్రి, విరాట్ కోహ్లీ శ‌కం ముగిసింది. ప్ర‌స్తుతం రాహుల్ ద్రావిడ్, రోహిత్ శ‌ర్మ శ‌కం మొద‌లైంది. టీమిండియా హెడ్ కోచ్‌గా ర‌వి శాస్త్రి, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా ప్ర‌యాణం విజ‌య‌వంతంగా సాగింది. ఎంత విజ‌య‌వంతంగా సాగితే ఏం లాభం ఈ జోడి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెల‌వ‌లేక‌పోయింది. దీంతో ఈ జోడి ఎంత బాధ‌ప‌డిందో తెలియదు కానీ అభిమానులు, మాజీ ఆట‌గాళ్లు మాత్రం తెగ బాధ‌ప‌డిపోతున్నారు. ర‌వి శాస్త్రి, విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా ప్ర‌పంచ‌క‌ప్ గెలుస్తుంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికీ అది సాధ్యం కాలేదు. దీంతో ప్ర‌స్తుతం కొత్తగా బాధ్య‌త‌లు చేపట్టిన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మనైనా ఆ లోటు తీర్చాల‌ని కోరుతున్నారు. అంతేకాకుండా కోచ్‌గా ద్రావిడ్, కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ విజ‌య‌వంత‌మైన ఆట‌గాళ్లు కావ‌డంతో క‌చ్చితంగా ప్ర‌పంచ‌క‌ప్ గెలుస్తార‌ని అంతా భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

తాజాగా ఈ జాబితాలో భార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ కూడా చేరిపోయారు. రోహిత్ శ‌ర్మ‌, రాహుల్ ద్రావిడ్ కాంబినేష‌న్ అద్బుత‌మైన‌ద‌ని కొనియాడిన మాష్ట‌ర్ బ్లాష్ట‌ర్.. ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను టీమిండియా వీరి నేతృత్వంలో గెలిస్తే చూడాల‌ని ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌చిన్ మాట్లాడుతూ రానున్న ఏప్రిల్ నెల‌తో టీమిండియా ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి 11 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతాయ‌ని గుర్తు చేశారు. దీంతో రోహిత్‌, రాహుల్ మ‌రో ట్రోఫి అందిస్తే చూడాల‌ని ఉంద‌ని స‌చిన్ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. అలాగే ఇది ఏళ్ల త‌ర‌ప‌డి కొన‌సాగుతున్న నిరీక్ష‌ణ అని చెప్పిన స‌చిన్.. త‌న‌తోపాటు చాలా మంది బీసీసీఐలో మ‌రో ట్రోఫిని చూడాల‌నుకుంటున్న‌ట్టు చెప్పారు. కాగా టీమిండియా చివ‌రి సారిగా 2011లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలో సచిన్ టెండూల్క‌ర్ కీల‌క పాత్ర పోషించారు.

Sachin Tendulkar To Take Up A Key Role In BCCI | Oneindia Telugu

క్రికెట‌ర్లంతా ఒక్క ప్ర‌పంచ‌క‌ప్ కోస‌మే ఆడ‌తార‌ని స‌చిన్ తెలిపారు. అది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అయినా, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అయినా ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మైన‌దేన‌ని చెప్పారు. తాను ఇదే ఫీల‌వుతాన‌ని ఆయ‌న తెలిసారు. రోహిత్ శ‌ర్మ‌, రాహుల్ ద్రావిడ్ త‌మ కెరీర్‌లో స‌రిప‌డా మ్యాచ్‌లు ఆడార‌ని, ఆట‌లోని ఎత్తు ప‌ల్లాలపై వారికి మంచి అవ‌గాహ‌న ఉంద‌ని స‌చిన్ అభిప్రాయ‌ప‌డ్డారు. వారిద్ద‌రు రానున్న ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేస్తార‌ని, వారికి అంద‌రి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. ఈ జోడి ఈ సారి క‌ప్ సాధించాలంటే త‌మ ఆత్మ‌విశ్వాసం కోల్పోక‌పోవ‌డం మంచిద‌ని స‌చిన్ టెండూల్క‌ర్ సూచించారు.

Story first published: Friday, January 28, 2022, 19:46 [IST]
Other articles published on Jan 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X