For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కారుని వెతికి పెట్టండి.. అభిమానులను కోరిన సచిన్!!

Sachin Tendulkar urges fans to help him find his first car Maruti 800

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు కార్ల అంటే ఎంతో ఇష్టం. క్రికెట్‌లోకి రాకముందు నుంచే ఇలాంటి కార్లు కొనాలని సచిన్ కలలు కనేవాడట. తన ఇంటికి సమీపంలోని సినిమా హాలు వద్ద ఉంచిన కార్లని చూసేందుకు సోదరుడితో కలిసి బాల్కనీలో గంటల కొద్దీ కూర్చునేవాడట. ఇక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిన తొలినాళ్లలో సొంత డబ్బుతో 'మారుతి 800' కారు కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ కారు తన వద్ద లేదని, ఎలాగైనా ఆ కారును వెతికి పెట్టమని అభిమానులను కోరారు.

'ఇన్‌ ద స్పాట్‌లైట్‌' అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ముదిత్‌ దానీతో కలిసి సచిన్ టెండూల్కర్‌‌ గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. తన కార్ల గ్యారేజీలో బీఎండబ్ల్యూ లాంటి బ్రాండెడ్ కార్లు ఎన్నో ఉన్నా.. ఆ మారుతి సుజుకీ 800 లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని సచిన్ చెప్పారు. ఇప్పుడు దాని కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. క్రికెట్ కెరీర్ ఆరంభంలో కొన్న మారుతి 800లో అప్పట్లో ఇంట్లో వాళ్లకి తెలియకుండా రోడ్డుపై చక్కర్లు కొట్టేవాడినని మాస్టర్ సరదాగా చెప్పారు.

'మారుతి 800 కారుతో నాది విడదీయరాని బంధం. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిన తొలినాళ్లలో సొంత డబ్బుతో కొన్నా. సెంటిమెంట్‌ పరంగా నాకు బాగా కలిసొచ్చిన కారు అది. కానీ ఇప్పుడు నా దగ్గర లేదు. ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్లు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. ఆ కారును మళ్లీ గ్యారేజీలో చూడాలనుకుంటున్నా. ఈ విషయంలో కారు యజమాని ఎవరో అభిమానులను వెతికి పెట్టమని కోరుకుంటున్నా' అని సచిన్ పేర్కొన్నారు.

రంజీల్లో అరంగేట్రం చేసేటప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ కూర్చున్న స్థానం నుంచే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినట్లు లిటిల్ మాస్టర్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు. 1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ‌ఆడిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు బాదారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించారు.

Story first published: Thursday, August 20, 2020, 17:54 [IST]
Other articles published on Aug 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+