కొత్త సంవత్సరం సందర్భంగా సచిన్ చెఫ్ అయ్యాడు (వీడియో)

హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా మాస్టర్ బ్లాైస్టర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబానికి, స్నేహితులకు తన చేతి వంటను రుచి చూపించాడు. తనే స్వయంగా వండిన వంటను వీడియో షూట్ చేసి తన అధికారిక ట్టిట్టర్ ఖాతా ద్వారా ప్రజల ముందుంచాడు. చూడండి సచిన్ వంటల తంటాలు.. మీరూ..
ఈ వీడియోలో 'ఇది యూఎస్‌కు చెందిన బార్బెక్యూ, వాహ్ దీని వాసన అద్భుతంగా ఉంది. ఇంకాసేపు ఉంచితే ఇంకా బాగుంటుంది.' అని స్వగతాన్ని బయటికి చెప్పుకొచ్చాడు. అంతకుముందు 'కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా నా స్నేహితుల కోసం వంటకాలు సిద్ధం చేస్తున్నా. నా వంట అందరికీ బాగా నచ్చింది. ఇప్పటికే నా వంటను రుచి చూసిన నా స్నేహితులు వారి చేతి వేళ్లను నాకుతూనే ఉన్నారు. ఈ ఏడాది మీ అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా. హ్యాపీ న్యూ ఇయర్ 2018' అని పేర్కొన్నాడు.
సచిన్ తాను వంట చేస్తోన్న వీడియోను అభిమానులతో పంచుకోగా దాన్ని ఇప్పటికే 42వేల మంది వీక్షించారు. పదివేలకు పౌగా లైక్‌లు కొట్టారు. అంతకుముందు సచిన్, యువరాజ్ సింగ్, అజిత్ అగార్కర్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో సచిన్ ధరించిన టోపీ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.
యో యో పరీక్ష పాసైన యువీ ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు.క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన తర్వాత సచిన్ కుటుంబం, సన్నిహితులు, వేడుకలు, ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. రాజ్యసభలో క్రీడల గురించి మాట్లాడాలనుకున్న సచిన్‌కు నిరాశ ఎదురుకావడంతో సామాజిక మాధ్యమాల ద్వారా.. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో క్రీడలను భాగం చేసుకోవాలని సూచించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications