బార్బర్‌గా మారిన సచిన్:
సచిన్ టెండూల్కర్ తన కొడుకు అర్జున్ టెండూల్కర్ కోసం బార్బర్‌గా మారాడు. అర్జున్‌కి హెయిర్ కట్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సచిన్.. తన కూతురు సారా టెండూల్కర్ సాయంతో ఆ పని పూర్తి చేశాడు. వాష్ రూంలో అర్జున్‌కి సచిన్ హెయిర్‌కట్ చేసాడు. ఒక్కోసారి ట్రిమ్మర్, మరోసారి కత్తెర పట్టుకుని జుట్టు కత్తిరించాడు. అచ్చం బార్బర్ చేసినట్టే చేసాడు సచిన్. చివరకు మిలిటరీ కటింగ్ చేసాడు. అర్జున్‌కి హెయిర్‌కట్ చేసిన వీడియోని లిటిల్ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

పిల్లల కోసం ఏదైనా చేయాల్సి వస్తుంది:
'ఒక తండ్రిగా పిల్లల కోసం ఏదైనా చేయాల్సి వస్తుంది. అది వాళ్లతో కలిసి ఆడుకోవడం, కలిసి జిమ్ చేయడంతో పాటు.. చివరికి హెయిర్‌కట్ కూడా చేయాల్సి వస్తుంది. అయితే హెయిర్‌కట్ జరిగిన తర్వాత నువ్వు ఎలాగో అందంగా కనిపిస్తావు అర్జున్. ఇక నా సెలూన్ అసిస్టెంట్ సారా టెండూల్కర్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు' అని సచిన్ తన వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రూ.50 లక్షలు విరాళం:
ప్రమాదకర కరోనా వైరస్‌పై పోరాడేందుకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.50 లక్షలు సచిన్ విరాళం ఇచ్చాడు. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నిరుపేదలు, వలస కూలీలు తినడానకి తిండి దొరక్క, చేయడానికి పని లేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలు, వలసకూలీలకు అండగా నిలుస్తున్న ముంబైలోని హైఫైవ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు మాస్టర్ భారీ మొత్తాన్ని అందజేశారు. భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షని దాటగా.. లాక్‌డౌన్‌ని మే 31 వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే.

గంగూలీతో మధురస్మృతులు:
సచిన్, సౌరవ్ గంగూలీ భారత జట్టుకు ఎంపికవ్వకముందే అండర్-15 స్థాయిలోనే కలిసి ఆడారు. దీంతో వారిద్దరి మధ్య అప్పటి నుంచే మంచి స్నేహం ఉండేది. కాలం గడుస్తున్నా కొద్దీ ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం, ఆప్యాయత పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాతో తనకున్న ఓ మధురస్మృతులను లిటిల్ మాస్టర్ అభిమానులతో పంచుకున్నాడు. 'దాదీ ఇంట్లో గడిపిన సంతోషకరమైన సాయంత్రం, గతస్మృతులు' అని సచిన్ కాప్షన్ రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












