సచిన్ 44: 'చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు'
హైదరాబాద్: నవంబర్ 15, 1989 బుధవారం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. సచిన్ పుట్టినరోజుని సందర్భంగా పలువురు క్రికెటర్లతో పాటు సెలబ్రిటీలు ఆయకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 1989, డిసెంబర్ 18న పాకిస్థాన్‌పై సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు.
తన 23 ఏళ్ల క్రికెట్ జీవితంలో ఎన్నో రికార్డులను సృష్టించడంతో పాటు మరెన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. మూడు ఫార్మెట్లలో 15వేలకు పైగా పరుగులు చేశాడు. అంతేనా క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు సచిన్ ఒక్కడే. అభిమానులు ముద్దుగా 'క్రికెట్ దేవుడి'గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేందుకు ముంబై ఇండియన్స్ జట్టు ఏర్పాట్లు చేస్తోంది.
సోమవారం పూణెతో జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వాంఖడేలో సచిన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ముంబై ప్రాంఛైజీ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది. ఈ పుట్టినరోజు వేడుకలకు సచిన్ టెండూల్కర్ కూడా హాజరవుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్న సచిన్‌కు.. జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అంటూ ముంబై 'హ్యాపీ బర్ద్‌డే మాస్టర్' టైటిల్‌తో ఉన్న సచిన్ ఫొటోను పోస్ట్ చేసింది.
అనిల్ కుంబ్లే
‘హ్యాపీ బర్త్‌డే సచిన్'. అత్యంత స్ఫూర్తిమంతమైన క్రీడాకారుడిని ప్రపంచం చూస్తోంది. అద్భుతమైన కాలం మీ ముందుందని ఆశిస్తున్నాను.'
వీరేంద్ర సెహ్వాగ్
సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. భారత్‌లో సమయాన్ని సైతం ఆపగలిగే గాడ్‌జీ నా పక్కనే నిద్రపోతున్నాడు'
ముంబై ఇండియన్స్
‘కోట్లాది అభిమానుల హృదయాలను సచిన్ గెలుచుకున్నాడు. జన్మదినం సందర్భంగా అతనికి కోట్లాది శుభాకాంక్షలు.'
బీసీసీఐ
‘సచిన్‌కు ప్రత్యేకమైన బర్త్‌డే శుభాకాంక్షలు'
రవిచంద్రన్ అశ్విన్
‘సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఏప్రిల్ 24న భారత క్రికెట్ డే. మీతో కలిసి ఆడటం నా అదృష్టం'
ఆర్పీ సింగ్
‘మాస్టర్ బ్లాస్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మా అందరికీ మీరు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు'
మైకెల్ క్లార్క్
'44 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈరోజుకి మీరు చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications