Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కనుబొమలు నల్లగా.. గడ్డం తెల్లగా ఎలా?: కాంబ్లిని ఆటపట్టించిన సచిన్

Sachin Tendulkar trolls Vinod Kambli while thanking him for the birthday wishes

హైదరాబాద్: ఏప్రిల్ 24... భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. 46వ పుట్టినరోజుని జరుపుకున్న సచిన్‌కి సోషల్ మీడియా ద్వారా క్రికెట్ అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ ఆయురారోగ్యంతో ఉండాలంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ సందర్భంగా కోరుకున్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సచిన్ పుట్టినరోజనాడు శుభాకాంక్షలు తెలిపిన వారిలో సచిన్ స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా ఉన్నాడు. తమ స్నేహాన్ని గుర్తుచేస్తూ ఓ పాటను పాడిన కాంబ్లీ, సచిన్‌కు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. అయితే, కాంబ్లీ చేసిన ట్వీట్‌పై సచిన్ సరదాగా స్పందించాడు.

''నీ అభినందనలకు చాలా థ్యాంక్స్. పాట చాలా బాగుంది. కానీ నీ గడ్డం తెల్లగా ఉండి, కనుబొమలు నల్లగా ఎలా ఉన్నాయో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది'' అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అభిమానులను తెగ నవ్విస్తోంది.

1973 ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ మరాఠి కుటుంబంలో పుట్టిన ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దేవుడయ్యాడు. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు సేవలందించిన సచిన్ 200 టెస్టులాడి 100 అంతర్జాతీయ సెంచరీలతో 34,357 పరుగులు చేశాడు.

Story first published: Friday, April 26, 2019, 19:36 [IST]
Other articles published on Apr 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+