Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లారెస్ అవార్డుల కార్యక్రమానికి సచిన్: భారత టీవీ చరిత్రలో ప్రపంచ కప్ రికార్డ్

షాంఘై/న్యూఢిల్లీ: ప్రపంచ క్రీడా అవార్డుల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లారెస్ స్పోర్ట్స్ అవార్డుల వేడుకల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. ఏప్రిల్ 15న షాంఘైలో ఈ కార్యక్రమం జరగనుంది.

లారెస్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సచిన్‌తోపాటుగా చైనాకు చెందిన ప్రముఖ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు యావో మింగ్‌, ఎన్‌ఎఫ్‌ఎల్‌ స్టార్‌ ఆటగాడు మార్కస్‌ అలెన్‌, దక్షిణాఫ్రికా రగ్బీ దిగ్గజాలు షాల్క్‌ బర్గర్‌, జీన్‌ డివిలియర్స్‌ తదితర ప్రముఖులు హాజరవుతారు.

భారత టీవీ చరిత్రలో ప్రపంచ కప్ రికార్డ్

Sachin Tendulkar to attend Laureus Sports Awards 2015

భారత టెలివిజన్ చరిత్రలో 2015 ఐసిసి ప్రపంచకప్‌ రికార్డు సృష్టించింది. భారత్‌లో టీవీలో అత్యధిక మంది వీక్షించిన ఈవెంట్‌గా ఈ ప్రపంచకప్‌ నిలిచింది. సెమీఫైనల్స్‌ వరకు మొత్తం 63.5 కోట్ల మంది ఈ ప్రపంచకప్‌ను టీవీలో తిలకించారు.

భారత్‌, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ను రికార్డు స్థాయిలో 30.9 కోట్ల మంది భారతీయులు చూశారు. ఈ ప్రపంచకప్‌లో ఎక్కువమంది చూసిన మ్యాచ్‌ ఇదే. ఆరు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయడం కూడా రేటింగ్‌ పెరగడానికి ఉపయోగపడింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+