కోహ్లీసేన పుంజుకుంటుంది: ఆసీస్ చేతిలో ఓటమిపై సచిన్
హైదరాబాద్: తొలి టెస్టులో ఆసీస్ చేతిలో ఓటమి పాలై విమర్శల పాలవుతున్న టీమిండియాకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచాడు. ఆదివారం న్యూఢిల్లీలో 21 కిలోమీటర్ల మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ టీమిండియా ఓటమిపై మాట్లాడాడు.
ఒక్క టెస్టు ఓటమితోనే సిరిస్ చేజారదని, కోహ్లీసేన మళ్లీ పుంజుకుంటుందని సచిన్ టెండూల్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'తొలి టెస్టు ఫలితం కఠినంగానే ఉంది. కానీ ఇదంతా ఆటలో భాగమే. ఒక్క టెస్టు ఓడినంత మాత్రాన సిరీస్ పోయినట్టు కాదు. ఒక్క ఓటమి ఎదురైనంత మాత్రాన తిరిగి పోరాడలేమని కాదు' అని సచిన్ అన్నాడు.

టీమిండియా స్ఫూర్తి గురించి నాకు తెలుసు
జట్టు స్ఫూర్తి గురించి తనకు తెలుసని, మిగిలిన మ్యాచ్‌ల్లో పుంజుకొని ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అక్కడ అనుకూల, ప్రతికూల పరిస్థితులు రెండూ ఉన్నాయి.. ఎంత వరకూ పుంజుకొంటారనేది వారి కృషిపై ఆధారపడి ఉంటుంది' అని సచిన్ అభిప్రాయపడ్డాడు.
చిత్తుగా.. చెత్తగా ఓడిన భారత్: కోహ్లీ అవుట్‌పై విమర్శలు

ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఇలాంటి అనుభవాలు సహజం
ప్రతి జట్టు లేదా ఆటగాడి కెరీర్‌లో ఇలాంటి అనుభవాలు ఆటను మరింత రసవత్తరంగా మారుస్తాయని సచిన్ అభిప్రాయపడ్డాడు. ‘సంతోషం కలిగించే సందర్భాలతోపాటు కష్టాలూ ఎదురవుతాయి. కానీ వాస్తవిక దృక్పథంతో పోరాడాలి. క్రీడాకారుల జీవితంలో రసవత్తర సంఘటనలు ఇవే' అని సచిన్ తెలిపాడు.

333 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించిన ఆసీస్
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 333 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఓకీఫ్ 'స్పిన్' సంచలనం: పూణె టెస్టులో చెత్తగా.. చిత్తుగా ఓడిన భారత్

బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యామన్న కోహ్లీ
మరోవైపు మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తమపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నాడు. ఊహించని విధంగా మ్యాచ్ ఫలితం వచ్చిందని అన్నాడు. తాము బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యామనే విషయాన్ని అంగీకరించాల్సి ఉంటుందని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications