బెంగుళూరు: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లను ఉత్సాహపరచడానికి తానెంతో ఆతృతతో ఉన్నట్లు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ఈ మేరకు సచిన్ ట్విట్టర్‌లో తన ఫోటోను పోస్ట్ చేశాడు. కమాన్ టీమిండియా అంటూ సచిన్ ట్విట్టర్‌లో తన సందేశాన్ని ఉంచాడు.
అంతర్జాతీయ ఆటల పోటీగా భావించే ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటాలంటూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) చేసిన విజ్ఞప్తి మేరకు సచిన్ టెండూల్కర్ అంగీకరించిన సంగతి తెలిసిందే.
రియో ఒలింపిక్స్‌కు భారత బృందం తరుపున సచిన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటారు.
అంతేకాదు సచిన్ టెండూల్కర్ తన జీవితంలోనే తొలిసారిగా ఒలింపిక్స్‌కు హాజరవుతున్నారు. ఆగస్టు 2న సచిన్ టెండూల్కర్ రియో ఒలింపిక్స్ జరగనున్న రియో డీ జనెరియోకు బయల్దేరి వెళ్లనున్నట్టు సచిన్ అధికార ప్రతినిధి తెలిపారు. బ్రెజిల్ దేశంలో ప్రస్తుతం జికా వైరస్ వ్యాప్తి చెంది ఉండటంతో పలువురు ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు రియో ఒలింపిక్స్‌కు హాజరు కాని విషయం తెలిసిందే.
అయితే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే భారత బృందాన్ని ఉత్సాహపరచడానికి గాను సచిన్ ఇటీవలే ముంబైలోని ఓ ఆసుపత్రిలో జికా వైరస్‌కు సంబంధించిన వాక్సిన్ వేయించుకున్నారు. స్వతహాగా ఆటలంటే ఎంతో ఇష్టపడే సచిన్ టెండూల్కర్ దేశం అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా పేరుగాంచారు.
భారత్‌లో ప్రీమియర్ పుట్‌బాల్ టోర్నమెంట్‌గా పేరుగాంచిన ఇండియన్ సూపర్ లీగ్ ప్రాంఛైజీలో సచిన్ ఓ జట్టుకు సహా యజమానికి వ్యవరహారిస్తున్నారు. రియో ఒలింపిక్స్ 2016లో భారత తరుపున పాల్గొంటున్న 120 మంది అథ్లెట్లను సచిన్ టెండూల్కర్ ఉత్సాహపరచనున్నారు.